Home News AP AP Minister Roja Satire on Pawan Kalyan | శ్వాస తీసుకోవాలా వద్దా అనేది...

AP Minister Roja Satire on Pawan Kalyan | శ్వాస తీసుకోవాలా వద్దా అనేది కేసీఆర్‌ను అడుగు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్

AP Minister Roja Satire on Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన ( Janasena ) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ప్రచార రథం వారాహి ( varahi ) వివాదం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దీనిపై జనసేన, వైఎస్‌ఆర్ సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. అది వారాహి కాదని.. నారాహి అని ఆరోపించారు. ఆయన ఎవరిమీద యుద్ధం చేస్తున్నాడో క్లారిటీ లేకుండా పోయిందని విమర్శించారు. వారాహి రంగు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వాహనాన్ని చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్‌కే భయపడని వాళ్లం.. ఆయన వాహనాన్ని చూసి ఎందుకు భయపడతామని ప్రశ్నించారు. ఆయన ఏ వాహనంలో వస్తే మాకేంటి అని అడిగారు. 171 సీట్లను గెలుచుకున్న జగన్ ఎక్కడా? రెండు స్థానాల్లో నిల్చుని ఓడిపోయిన పవన్ ఎక్కడా? అని ప్రశ్నించారు.

మా నాయకుడు జగన్ దమ్మున్న నాయకుడు. 175 స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేని మిమ్మల్ని చూసి మేమేందుకు భయపడాలని ప్రశ్నించారు. ‘ మేం యుద్ధానికి రెడీ.. మా నాయకుడు ప్రజా క్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. మీకు దమ్ముంటే జనసేన నుంచి 175 మందిని నిలబెట్టండి. అంతేతప్ప ఎవరి సైన్యంలోనైనా దూరి దొంగదెబ్బ తీయాలనుకోవద్ద’ని హితవు పలికారు.

కేసీఆర్, కేటీఆర్‌ను అడుగు పీకే

శ్వాస తీసుకోవచ్చా అంటూ వైసీపీ నేతలను అడుగుతూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై కూడా రోజా సెటైర్ వేశారు. ఈ మూడున్నర సంవత్సరాలు శ్వాస తీసుకోకుండానే పీకే ఉన్నాడా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బతుకుతున్న నువ్వు.. శ్వాస తీసుకోవాలా? వద్దా ? అని అడగాల్సింది కేసీఆర్‌ను, కేటీఆర్‌ను అని కౌంటర్ ఇచ్చింది. ఏపీలో ఉంటే మమ్మల్ని అడగాలి.. కానీ నువ్వు హైదరాబాద్‌లో ఉంటావు కాబట్టి వాళ్లనే అడుగు అంటూ సెటైర్ వేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

MLC Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. సాయంత్రం దాకా విచారణ !

TSRTC Special Offer | అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు

Bandi Sanjay | బీజేపీతో కలిసి రండి.. ప్రగతి భవన్ బద్దలు కొడదాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బండి సంజయ్ పిలుపు

Nizamabad Bride | కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు ఆత్మహత్య.. వరుడి వేధింపులే కారణమా?

Exit mobile version