Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsAPRK Roja | లోకేశ్‌ది మామూలు లెగ్ కాదు.. ఎక్కడ కాలు పెడితే అక్కడ.. ఏపీ...

RK Roja | లోకేశ్‌ది మామూలు లెగ్ కాదు.. ఎక్కడ కాలు పెడితే అక్కడ.. ఏపీ మంత్రి రోజా ఫైర్

RK Roja | నారా లోకేశ్ మొదలు పెట్టిన యువగళం పాదయాత్ర గురించి వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాదయాత్ర గురించి ఇప్పటికే ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని, శ్రీకాకుళం మంత్రి సీదిరి అప్పల రాజు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి ఆర్కే రోజా ఈ పాదయాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తండ్రి పేరు చెప్పుకొని లోకేశ్ రాజకీయాల్లోకి రావడమే తప్ప.. అసలు అతనికి రాజకీయాల గురించి ఏం తెలుసు అంటూ విరుచుకుపడ్డారు. తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు పుష్కరాల కోసం వెళ్తే భక్తులు చనిపోయారు. యువగళం గురించి పోస్టర్‌ విడుదల చేయగానే తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు. యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన రోజే తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. అతను లోకేశ్ కాదు… పులకేశీ అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని రోజా కోరారు. చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి తీసుకుని లోకేశ్‌ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.

అసలు లోకేశ్‌కి కానీ, చంద్రబాబుకి కానీ మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని ఆర్కే రోజా మండిపడ్డారు. సీఎం జగన్‌ పాలనలో మహిళలకు భద్రత పెరిగిందని తెలిపారు. సొంత బావ తారకరత్నకు గుండెపోటు వచ్చి పడిపోతే కనీసం పట్టించుకోకుండా లోకేశ్‌ పాదయాత్ర చేశాడని.. అసలు అలాంటి వ్యక్తికి జగన్‌ ను విమర్శించే అర్హత లేదని అన్నారు. కనీసం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు గురించి కూడా తెలియదని అన్నారు. ‘జీవోను జియో అంటారు. పాలనను పానల అంటారు. ప్రశాంతతను పట్టుకుని ప్రశాంత అత్త అంటారు. ఇలాంటి వ్యక్తి జగన్‌ గురించి మాట్లాడుతున్నారు. అతను లోకేశ్‌ కాదు పులకేశి’ అని చెప్పుకొచ్చారు.

పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్‌ నూటికి 98 శాతం హామీలు నెరవేర్చారని.. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి దొంగదారిలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ మాట్లాడే ప్రతి మాట అబద్దమేనని విరుచుకుపడ్డారు. వామ్మో అది లెగ్గు కాదు… అసలు మామూలు పాదం కాదు… పెద్ద ఐరన్ లెగ్‌… ఆ పాదాలకు ఓ దండాలురా సామీ అంటూ ఏపీ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ యువగళం పాదయాత్ర పై ధ్వజమెత్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Nandamuri Tarakaratna | అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం.. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస

Vijayashanthi on KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆయనో విష సర్పం!

Layoff | ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్ ఉద్యోగం ఔట్.. గూగుల్‌లో లే ఆఫ్‌ ఎఫెక్ట్!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News