Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsHimayath nagar | హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు.. ఇరుక్కుపోయిన ట్రక్కు

Himayath nagar | హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు.. ఇరుక్కుపోయిన ట్రక్కు

Himayath nagar | హైదరాబాద్‌లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. గత నెలలో గోషామహాల్‌లోని చట్నావాడి ప్రాంతంలో రోడ్డు కుంగిన ఘటన మరవకముందే తాజాగా హిమాయత్‌నగర్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. హిమాయత్ నగర్‌లోని ఐదో నంబర్ రహదారిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది.

అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో మట్టి లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు పక్కనే నాలా ప్రవహిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మీ అధికారులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. అయితే రోడ్డుపై ఇరుక్కుపోయిన టిప్పర్‌ను జేసీబీ సాయంతో తొలగించిన తర్వాత.. గుంత చుట్టూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

హిమాయత్ నగర్‌లోని రోడ్డు నంబర్ 1 నుంచి 12 వరకు రిపేర్లు చేయించాలని.. ముఖ్యంగా నాలాల వద్ద అస్సలు రోడ్లు బాగోలేవని జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని ఈ సందర్బంగా గడ్డం మహాలక్ష్మీ తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా సరే పైపైన డాంబర్ వేసి వెళ్తున్నారే తప్ప.. రిపేర్ వర్క్స్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గత రెండు మూడ్రోజులుగా రోడ్లపై శబ్దాలు వస్తున్నాయని అధికారులకు చెప్పామని.. అయినప్పటికీ వాళ్లు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Nandamuri Tarakaratna | అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం.. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస

Vijayashanthi on KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆయనో విష సర్పం!

Layoff | ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్ ఉద్యోగం ఔట్.. గూగుల్‌లో లే ఆఫ్‌ ఎఫెక్ట్!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News