Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsViral News | చిన్నారి చికిత్స కోసం రూ. 11.6 కోట్లు దానం.. అనామక వ్యక్తిపై...

Viral News | చిన్నారి చికిత్స కోసం రూ. 11.6 కోట్లు దానం.. అనామక వ్యక్తిపై నెటిజనుల ప్రశంసలు

Viral News | ఎవరికైనా ఒక్క రూపాయి ఇవ్వాలంటేనే ఆలోచించే రోజులివి. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా రూ. 11 కోట్లు విరాళంగా ఇచ్చేశాడు. అదీ 15 నెలల బాలుడిని కాపాడేందుకు. ఇంత భారీ విరాళం ఇచ్చినా కూడా తన పేరును మాత్రం బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడ్డాడు.

కేరళలోని పాలక్కడ్‌కు చెందిన సారంగ్‌ మీనన్‌, అదితి నాయర్‌ దంపతుల 15 నెలల బాలుడు నిర్వాన్‌.. స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చికిత్స అందించాలంటే దాదాపు రూ. 17.5 కోట్లు ఖర్చువుతుందని డాక్టర్లు చెప్పారు. అన్ని డబ్బులు వెచ్చించి చికిత్స అందించే పరిస్థితి ఆ దంపతులకు లేదు. కానీ తమ బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలన్నతపన మాత్రం ఉంది. అందుకే నిర్వాన్‌ తల్లిదండ్రులు ఫేస్‌బుక్‌లో ప్రకటన విడుదల చేశారు. తమ బిడ్డను కాపాడేందుకు దాతలు మందుకు రావాలంటూ పిలుపునిచ్చారు.

అంతకు కొన్ని వారాల ముందు నుంచి క్రౌడ్ ఫండింగ్‌ ద్వారా విరాళాలు సేకరిస్తూ నిర్వాన్‌కు చికిత్స అందిస్తున్నారు. వీరికి సాయంగా మలయాళ నటి అహనా కృష్ణ కూడా సోషల్‌ మీడియాలో విజ్ఞప్తి చేశారు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 17 లక్షల మంది రూ. 100 చొప్పున దానం చేస్తే బాలుడి వైద్యానికి అవసరమైన రూ.17 కోట్లు సమకూరుతాయని పేర్కొన్నారు. ఆమె విజ్ఞప్తికి భారీగా స్పందన వచ్చింది. ఫిబ్రవరి 19 వరకు దాదాపు రూ. 5.42 కోట్ల విరాళాలు వచ్చాయి.

అయితే ఫిబ్రవరి 20న ఒక అనామక దాత ఏకంగా రూ.11.6 కోట్లు దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. తన వివరాలు కూడా వెల్లడించేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పదీ పరకా దానం చేసి గొప్పలు చెప్పుకునే వాళ్లున్న కాలంలో రూ. 11.6 కోట్లు దానం చేసినా తన పేరు బయటకు రానివ్వకపోవడంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ పేరులేని దాతను కొనియాడుతున్నారు.

బాలుడి తండ్రి సారంగ్‌ ఆస్ట్రేలియాలో మెరైన్‌ ఇంజినీర్‌ కాగా, తల్లి ఐటీ ఉద్యోగి. ఆస్ట్రేలియాలోని నివాసం ఉండేవారు. అయితే బాలుడు అనారోగ్యానికి గురికావడంతో జనవరి 19న భారత్‌కు వచ్చారు. ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చూపించగా తమ కుమారుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి చికిత్సకు రూ. 17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో సోషల్‌ మీడియాలో దాతల కోసం విజ్ఞప్తి చేశారు. కాగా, తమ బాలుడి చికిత్స కోసం ఒక్కరే రూ. 11.6 కోట్లు విరాళం అందించడంపై తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. దేవుడే తమ బిడ్డను రక్షించేందుకు దాతల రూపంలో వచ్చారని చెప్పుకొచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News