Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsID card for Dogs | జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కలకు ఐడీ కార్డులు.. మున్సిపల్ అధికారులకు...

ID card for Dogs | జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కలకు ఐడీ కార్డులు.. మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు

ID card for Dogs | హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వీధి కుక్కల బెడదలను నివారించేందుకు సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లు, చికెన్‌, మటన్‌ సెంటర్లలోని వ్యర్థాలను వీధుల్లో వేయకుండా చూడాలని అదేశించారు. నగరంలో కుక్కల సంఖ్యను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని.. పెంపుడు కుక్కలపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు.

ప్రత్యేక యాప్‌..

జీహెచ్‌ఎంసీ పరిధిలో పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేకం యాప్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు పరిసర మున్సిపాలిటీల్లో పెంపుడు జంతువుల సంఖ్యను దీని ద్వారా గుర్తించే వీలుంటుందన్నారు. ఈ యాప్‌లో యజమానులు నమోదు చేసుకుంటే.. దాని ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అంతేకాదు.. వీధి కుక్కల విషయంలో ఫిర్యాదులను మై జీహెచ్‌ఎంసీ యాప్‌తో పాటు 04021111111 నంబర్‌ ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News