Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentThe OG | ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కాదు.. రామ్‌చరణ్‌!!

The OG | ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కాదు.. రామ్‌చరణ్‌!!

The OG.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ కదా.. మరి రామ్‌చరణ్‌ను ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టార్‌ అంటున్నారేంటని షాకవుతున్నారా! కానీ ఇది మేము ఒక్కరం అంటున్న మాట కాదు.. మెగా అభిమానులు చెబుతున్న మాట. మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఐడెంటిటీ క్రియేట్‌ చేసుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా కాదు.. పాన్‌ వరల్డ్‌ స్టార్‌ అయ్యాడు. యాక్టింగ్‌.. ఆటిట్యూడ్‌.. స్టైల్‌తో హాలీవుడ్‌ జనాలు అంతా తన వెనుకబడేలా చేసుకున్నాడు. అక్కడ కూడా తిరుగులేని క్రేజ్‌ను దక్కించుకున్నాడు. అందుకే ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టార్‌ అని పిలవడానికి మెగా పవర్‌ స్టార్‌కు ఏం తక్కువ అని ప్రశ్నిస్తున్నారు. we call him OG అంటూ రామ్‌చరణ్‌ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

ఓజీ అని మాత్రమే కాదు రామ్‌చరణ్‌ను గ్లోబల్‌స్టార్‌ అని కూడా తెగ పొగిడేస్తున్నారు. దీనికి కారణం హాలీవుడ్‌ నుంచి అతనికి అరుదైన అవకాశాలు రావడమే. అవేంటని అంటారా? హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ( HCA ) అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించాలని రామ్‌చరణ్‌కు పిలుపువచ్చింది. దీంతో ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలో జరగబోయే వేడుకలో పాల్గొనేందుకు చరణ్‌ అమెరికా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడి పాపులర్‌ టాక్‌ షో అయిన గుడ్‌మార్నింగ్‌ అమెరికాలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ టాక్‌ షోలో పాల్గొనే అవకాశం వచ్చిన మొదటి టాలీవుడ్‌ నటుడు చెర్రీనే కావడం గమనార్హం. అందుకే రామ్‌చరణ్‌ను ఓజీ అని పిలుస్తున్నారు. అంతేకాదు గుడ్ మార్నింగ్‌ అమెరికా టాక్‌ షోలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో దిగిన స్టిల్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ తెగ వైరల్‌ చేస్తున్నారు. #GlobalStarRamcharan అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News