Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentRRR | ఎత్తరా జెండా.. కొట్టరా తొడ.. తిప్పరా మీసం.. వచ్చిందిరా ఆస్కార్..!

RRR | ఎత్తరా జెండా.. కొట్టరా తొడ.. తిప్పరా మీసం.. వచ్చిందిరా ఆస్కార్..!

RRR | పైకి చెప్పడం లేదు కానీ.. ఇండియాలో ప్రతి ఒక్కరి ఫీలింగ్ మాత్రం ఇప్పుడిదే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కనీసం దగ్గరికి కూడా వెళ్లలేకపోతున్న ఆస్కార్ అవార్డును తెలుగింటికి తీసుకొచ్చాడు రాజమౌళి. కనీసం ఇండియన్ సినిమాకు ఆస్కార్ వేడుకల్లో కనిపించే ఆస్కారం ఉందా.. మనల్ని కనీసం వాళ్లు పట్టించుకుంటారా అనే దగ్గర నుంచి ఈరోజు ఆస్కార్ అవార్డు గెలుచుకొని ఇండియాకు తీసుకొచ్చాడు రాజమౌళి. దాంతో పాటు మరో షార్ట్ ఫిలిం కూడా అకాడమీ అవార్డులో సత్తా చూపించింది. మొత్తానికి 95 వ ఆస్కార్ అవార్డ్స్ ఇండియాకు మరిచిపోలేని తీపి గుర్తులను మిగిల్చింది.

మూడు నామినేషన్స్ లో రెండు అవార్డులు గెలుచుకొని భారత దేశ సత్తాను ప్రపంచ ఎవనికపై చూపించాయి మన సినిమాలు. ఇదిలా ఉంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది అని అందరూ అనుకున్నారు. దాన్ని నిజం చేస్తూ.. ఆ నమ్మకాన్ని మరోసారి ప్రూవ్ చేస్తూ ఆస్కార్ అందుకున్నారు కీరవాణి, చంద్రబోస్. వాళ్లిద్దరి చేతుల్లో అకాడమీ అవార్డు అలా మెరుస్తుంటే ప్రతి తెలుగోడి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. అందుకే సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు చెబుతున్నారు.

మన నాటు నాటు పాట అమెరికాలోనే కాదు.. ప్రపంచం మొత్తం అందరితో కాలు కదిపేలా చేసింది. దాని ఫలితమే ఈరోజు అకాడమీ అవార్డు విన్నింగ్ మూమెంట్. దానికోసం రాజమౌళి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన కొడుకు కార్తికేయ పడిన కృషి ఎప్పటికీ తక్కువ చేయలేం. ఈ అవార్డు ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింది అంటే దాని వెనుక మాస్టర్ మైండ్ కార్తికేయ అనే విషయాన్ని మర్చిపోకూడదు. రాజమౌళి ప్రతి ఆలోచనను కార్తికేయ దగ్గరుండి చూసుకున్నాడు. అందుకే కీరవాణి కూడా అవార్డు అందుకోగానే ముందుగా కార్తికేయకు కంగ్రాట్యూలేషన్స్‌తో పాటు థాంక్యూ కూడా చెప్పాడు. ఎలా చూసుకున్నా కూడా ఈసారి ఇండియాకు ఆస్కార్ అవార్డులు బాగా కలిసి వచ్చాయి.

ఈ దెబ్బతో 96వ ఆస్కార్ అవార్డుల్లో కచ్చితంగా ఇండియా నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయనే ఆలోచన అందరిలోనూ మొదలవుతుంది. దానికి బీజం వేసిన దర్శకుడు మాత్రం రాజమౌళి. ఇప్పటినుంచి ఆస్కార్ వెళ్లడానికి ఎవరికి దారి కావాలన్నా కూడా వాళ్లకు మార్గనిర్దేశం చేసేది మాత్రం దర్శక ధీరుడే. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాట్యూలేషన్స్ టు ఆర్ఆర్ఆర్ టీమ్.

Read More ;

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News