Tuesday, April 23, 2024
- Advertisment -
HomeNewsInternationalViral News | అదృష్టం అంటే వీడిదే.. రాత్రికి రాత్రే.. టాటాను మించిపోయాడు!

Viral News | అదృష్టం అంటే వీడిదే.. రాత్రికి రాత్రే.. టాటాను మించిపోయాడు!

Viral News | టాటా, బిర్లాలు అవ్వాలంటే ఎవరు రాత్రికి రాత్రే అయిపోరు. ఎంతో కష్టపడితే కానీ అంతటి వారు అవ్వరు. అలా శ్రమను, వారి కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వారిని మనం చాలా మందిని చూశాం కూడా. కానీ కాలిఫోర్నియాలోని ఓ వ్యక్తి మాత్రం కష్టపడకుండా రాత్రికే రాత్రే అపర కుబేరుడు అయిపోయాడు. ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా లాటరీ గెలుచుకుని బిలియనీర్‌గా మారిపోయాడు.

ఏకంగా వేల కోట్లు రూపాయల జాక్‌పాట్ తగలడంతో అస్సలు ఆలస్యం చేయకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఇంటిని సొంతం చేసుకుని మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. అమెరికా చరిత్రలోనే అత్యంత విలువైన పవర్​బాల్ మెగా లాటరీని గెలుచుకున్న అతని పేరు ఎడ్విన్ క్యా్స్ట్రో . అతనిది కాలిఫోర్నియా.

2022, నవంబర్‌లో 2 బిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో సుమారుగా రూ.16,407 కోట్లు) లాటరీని నెగ్గడం ద్వారా ఎడ్విన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ లాటరీని యూఎస్‌​లో ఇప్పటిదాకా కేవలం నలుగురు మాత్రమే గెల్చుకున్నారు. కాగా, తాజా లాటరీలో ట్యాక్స్, ఇతర తగ్గింపులు పోనూ మొత్తం రూ.8,180 కోట్లు కాస్ట్రో చేతికి వచ్చాయట. దీంతో ఒక్క రాత్రిలోనే అతడి లైఫ్ మారిపోయింది. హాలీవుడ్ సెలెబ్రిటీలు, ఇతర ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతంలో రూ.200 కోట్ల అతి ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశాడు కాస్ట్రో.

అరియానా గ్రాండే, డకోటా జాన్సన్, జిమ్మీ కిమ్మెల్ లాంటి సెలబ్రిటీల పొరుగువాడిగా చేరిపోయాడు కాస్ట్రో. ఆస్తి విషయంలో భారత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటాను కూడా అధిగమించాడు. టాటా వ్యక్తిగత ఆస్తుల కంటే కాస్ట్రో ఆస్తులు నాలుగు రెట్లు ఎక్కువని తెలుస్తుంది. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి దాదాపుగా రూ.4 వేల కోట్ల రూపాయలు అని తెలిపింది.

కాస్ట్రో కొనుగోలు చేసిన ఇల్లు విస్తీర్ణం 13,500 చదరపు అడుగులు. ఐదు లగ్జరీ రూములు, అధునాతన సదుపాయాలతో ఉన్న ఏడు బాత్​రూంలు, ఇన్ఫినిటీ పూల్, రెండు ఫైర్ పిట్స్, ఔట్​డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, మూవీ థియేటర్, ఫిట్​నెస్ స్టూడియో, రూఫ్​టాప్ డెక్, ఫైవ్ కార్​ షోరూం, రెండు కార్ల గ్యారేజీలతో పాటు ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News