Home News International Economics Nobel 2022 | ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌.. సంక్షోభంలో బ్యాంకులు బ‌ల‌హీనంగా మారొద్దంటే...

Economics Nobel 2022 | ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌.. సంక్షోభంలో బ్యాంకులు బ‌ల‌హీనంగా మారొద్దంటే ఏం చేయాలి?

Economics Nobel 2022 | అస‌లు మ‌న‌కు బ్యాంకులు ఎందుకు ఉన్నాయి? సంక్షోభ స‌మ‌యంలో బ్యాంకులు బ‌ల‌హీనంగా మార‌కుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ప‌రిశోధ‌న‌లు చేసినందుకు గానూ అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ఆర్థికవేత్త‌లు బెన్ ఎస్‌.బెర్నాన్కే, డ‌గ్ల‌స్ అడ్ల్యూ.డైమండ్‌, ఫిలిప్ హెచ్‌.డిబ్‌విగ్‌ల‌కు నోబెల్ పురస్కారం ద‌క్కింది. ఆర్థిక శాస్త్రం విభాగంలో ఈ ముగ్గురు నోబెల్ బ‌హుమతి (Nobel in Economics ) కి ఎంపిక‌య్యారు. రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 10న స్వీడ‌న్ రాజ‌ధాని స్టాక్ హోమ్‌లో జ‌రిగే నోబెల్ పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వంలో వీరికి అవార్డులు అంద‌జేయ‌నున్నారు. నోబెల్ పుర‌స్కారానికి ఎంపికైన ఈ ముగ్గురు ఆర్థిక వేత్త‌ల‌కు రూ.7.50 కోట్ల ప్రైజ్ మనీతో పాటు మెడ‌ల్‌, డిప్లొమా అందించ‌నున్నారు.

ఒక దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ నిర్మాణంలో బ్యాంకులు ఎలాంటి పాత్ర పోషిస్తాయి. ఆర్థిక సంక్షోభం అలుముకున్న‌ప్పుడు బ్యాంకులు పాత్ర ఏంటి? సంక్షోభ స‌మ‌యంలో అవి బ‌ల‌హీనంగా మార‌కుండా ఉండాలంటే ఏం చేయాల‌నే అంశాల‌పై ఈ ముగ్గురు ఆర్థికవేత్త‌లు అధ్య‌య‌నం చేశార‌ని నోబెల్ క‌మిటీ తెలిపింది. 1980ల్లో బెన్ బెర్నాన్కే, డ‌గ్ల‌స్ డైమండ్‌, ఫిలిప్ డిబ్‌విగ్‌లు ఈ ప‌రిశోధ‌న‌కు పునాదులు వేశార‌ని క‌మిటీ తెలిపింది. వారి విశ్లేష‌ణ‌లు ఆర్థిక సంక్షోభాల‌ను ఎదుర్కోవ‌డంలో ఆచ‌ర‌ణాత్మ‌క ప్రాముఖ్య‌త‌ను క‌లిగి ఉంటాయ‌ని పేర్కొంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

Exit mobile version