Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleDevotionaldevotional | పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల తొమ్మిదో రోజు అత్తవారింటికి వెళ్లొచ్చా?

devotional | పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల తొమ్మిదో రోజు అత్తవారింటికి వెళ్లొచ్చా?

devotional | ఆడపిల్లను లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. అందుకే పెళ్లయిన తర్వాత అమ్మాయి పుట్టింటికి వచ్చినా.. తిరిగి అత్తారింటికి వెళ్లాలన్నా అనేక వారాలు, వర్జ్యాలు, తిథులను చూస్తుంటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయొద్దని పెద్దలు చెబుతారు. అలాగే మంగళ, శుక్రవారాల్లో కూడా తిరిగి అత్తవారింటికి వెళ్లొద్దని అంటారు. మరి అలా ఎందుకు చెబుతారో ఒకసారి చూద్దాం..

కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలను తిథులు అని అంటారు. వీటిలో తొమ్మిదో రోజు వచ్చేది నవమి. ఇది శుభకార్యాలకు పనికి రాదు. దీని ప్రకారం పుట్టింటికి వెళ్లినా, బంధువుల ఇంటికి వెళ్లినా తొమ్మిదో రోజు తిరుగు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. నవమి తిథి నాడు ప్రయాణాలు చేస్తే కష్టనష్టాలు ఎదురవుతాయి. అందుకే నవమి తిథిని ప్రయాణాలకు నిషేధించారు.

ఇక మంగళ, శుక్రవారాలు లక్ష్మీ దేవి స్థానాలని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మహాలక్ష్మీ స్వరూపమైన ఆడబిడ్డను ఆ రోజుల్లో బయటకు వెళ్లనివ్వరు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత అమ్మాయిని మంగళ, శుక్రవారాల్లో అస్సలు అత్తవారింటికి వెళ్లనివ్వరు. అలా వెళ్తే ఆ అమ్మాయితో పాటే మహాలక్ష్మి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మంగళ, శుక్రవారాల్లో వెళ్లాల్సి వస్తే.. ముందు రోజు గడప బయట ఒక సంచిని ఉంచుతారు. తర్వాత రోజు ఆడపిల్ల అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆ సంచిని తీసుకెళ్లమని చెబుతారు. అలా చేస్తే దోషం ఉండదని భావిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News