Home Latest News IRCTC Train Ticket Transfer | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మీ టికెట్ ఇలా వేరే...

IRCTC Train Ticket Transfer | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మీ టికెట్ ఇలా వేరే వాళ్ల పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయండి

IRCTC Train Ticket Transfer | రవి హైదరాబాద్‌లో జాబ్ చేస్తుంటాడు. బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని నెల ముందుగానే ఊరికి వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా ప్రయాణ సమయం వచ్చేసరికి అతనికి లీవ్ దొరకలేదు. ఎలాగైనా సరే బంధువుల పెళ్లికి ఇంటి నుంచి ఒకరు వెళ్లకతప్పదు. అందుకే తనకు బదులు వాళ్ల నాన్నను పంపించాలని అనుకున్నాడు. కానీ రైల్వే టికెట్లు అన్నీ అయిపోయాయి. రవికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు నెల ముందే తను బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోవడంతో పెనాల్టీ రూపంలో కొంత నష్టపోయాడు. పైగా చివరి నిమిషంలో వాళ్ల నాన్న కోసం బుక్ చేసిన టికెట్ కన్ఫార్మ్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వచ్చింది. రవి ఒక్కడే కాదు ఇలాంటి సమస్యను మనలో చాలామందే ఎదుర్కొని ఉంటారు. ఇలాంటి ఇబ్బందిని గుర్తించిన ఐఆర్‌సీటీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. తన పేరు మీద బుక్ చేసుకున్న టికెట్‌ను వేరే వాళ్ల పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

టికెట్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే..

  • ముందుగా కన్ఫార్మ్ అయిన టికెట్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
  • ఆ ప్రింటవుట్ తీసుకుని సమీపంలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్లాలి.
  • ఎవరి పేరు మీదకు టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ఆధార్ లేదా ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి.
  • రైల్వే టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌లో ట్రాన్స్‌ఫర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

షరతులు వర్తిస్తాయి

ఈ టికెట్‌ను ఎవరికి పడితే వారికి ట్రాన్స్‌ఫర్ చేయలేం. కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే బదిలీ చేయవచ్చు. అది కూడా ప్రయాణానికి 24 గంటల ముందే ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ట్రాన్స్‌ఫర్ ఒక టికెట్‌పై ఒక్కసారి మాత్రమే చేయవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Exit mobile version