Home Lifestyle Health Mosquitoes | మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా ? ఈ వంటింటి చిట్కాలతో...

Mosquitoes | మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా ? ఈ వంటింటి చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు.. అదేలాగంటే ?

Mosquitoes | సాయంత్రమైతే చాలు ఇంట్లోకి దోమలు సర్రున వచ్చేస్తాయి. డోర్లు పెట్టి ఉంచినా ఎలాగోలా ఇంట్లోకి వచ్చి చికాకు పెడుతుంటాయి. దోమల బ్యాటుతో వాటి పనిచెబుదామన్న క్షణాల్లో తప్పించుకుంటాయి. కాయిల్స్‌ పెట్టినా పూర్తిస్థాయిలో దోమల బెడదకు పరిష్కారమైతే లభించదు. పైగా ఇంట్లో చిన్నపిల్లలుంటే.. కాయిల్స్‌ వాడటం కాస్త ఇబ్బందే. అయితే.. సహజసిద్ధంగా మీ వంటింటి చిట్కాలతో సహజసిద్ధంగా దోమలకు చెక్‌ పెట్టేయొచ్చు.. ఎలాగో తెలుసా?

ఇంటికి సమీపంలో ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లైతే వాటిలో దోమలు గుడ్లు పెడతాయి. తులసి, పుదీనా, లెమన్ గ్రాస్‌ ఆకుల రసాన్ని అలాంటి నీళ్లలో కలిపితే దోమల గుడ్లు నశిస్తాయి. ముఖ్యంగా తులసీ ఆకుల వాసన దోమలకు అస్సలు పడదట. ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉంటే పుదీనా ఆకులను నీటిలో వేసి.. కాసేపు వేడి చేసి, ఆ నీటిని ఇంట్లో స్ప్రే చేస్తే దోమలు పారిపోతాయి. అలాగే ఆ నీటిని ఆవిరిగా ఉపయోగించినా కూడా ఫలితం ఉంటుంది.

➸ వెల్లుల్లి రెబ్బలను కోసి డోర్లు, కిటీకీల వద్ద పెట్టినట్లైతే దోమలకు ఇంట్లోకి రావు. వెల్లుల్లిని నీటిలో కాచి.. ఆ నీళ్లను చర్మానికి రాసుకున్నా దోమలు కుట్టవు. అంతేకాదు.. వెల్లుల్లి వేసి కాచిన నీటిని స్ప్రే చేస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి ప్రవేశించలేవు.

➸ వేప, కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో కలిపి చర్మంపై రాసుకుంటే కొన్ని గంటల వరకు దోమలు మన దగ్గరికి రావు.

➸ ప్రతి రోజు నాలుగైదు నిమ్మ ఆకులను ఇంట్లో కాలిస్తే ఆ పొగకు దోమలు పరారవుతాయి.

➸ నీలగిరి ఆకుల నుంచి వచ్చిన నూనెను నీటిలో కలిపి ఒంటికి రాసుకున్నా దోమలు దగ్గరికి రావు.

➸ కృష్ణ తులసిని ఇంటి ఆవరణలో పెంచితే.. దాన్నుంచి వచ్చే ఘాటైన వాసనకు దోమలు పారిపోతాయి.

➸ నిమ్మగడ్డి పెంచినా.. దోమలు పారిపోతాయి. ఈ గడ్డి ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది

Exit mobile version