Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 16-12-2022)

Horoscope Today | రాశిఫలాలు ( 16-12-2022)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు సూచన ఉంది.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రుల నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులను పొందుతారు. సోదరులను కలుసుకుంటారు.

సింహం

సంతానం, నూతన ఉద్యోగ లాభాన్ని పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అరుదైన సన్మానాలు పొందుతారు. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం కలుగుతుంది.

కన్య

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి.

తుల

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు పొందే అవకాశం ఉంది.

వృశ్చికం

కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తు లాభ సూచన ఉంది.

ధనుస్సు

వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగిపోతాయి.

మకరం

మిత్రులతో ఏర్పడిన విబేధాలు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సంతానం నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

కుంభం

పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మీనం

ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. వ్యవహారాల్లో విజయం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తు కొనుగోలు సూచన ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version