Friday, March 31, 2023
- Advertisment -
HomeLatest NewsRCB vs DC Highlights | డబ్ల్యూపీఎల్‌లో షఫాలీ వర్మ శివతాండవం.. బెంగళూరుపై ఢిల్లీ అద్భుత...

RCB vs DC Highlights | డబ్ల్యూపీఎల్‌లో షఫాలీ వర్మ శివతాండవం.. బెంగళూరుపై ఢిల్లీ అద్భుత విజయం

RCB vs DC Highlights | టైమ్ 2 న్యూస్, ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)లో పరుగుల జాతర సాగుతోంది. తొలి మ్యాచ్‌లో హర్మన్ మెరుపులు మరువక ముందే.. రెండో పోరులో షఫాలీ వర్మ విధ్వంసం సృష్టించింది. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్నచందంగా చెలరేగిన షఫాలీ ఢిల్లీకి కొండంత స్కోరు అందించగా.. ఛేదనలో కాస్త పోరాడిన బెంగళూరు లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఆదివారం జరిగిన తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్‌పై యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు రెచ్చిపోగా.. మెగ్ లానింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు), మరీనె కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టారు. క్రీజులో అడుగుపెట్టింది మొదలు ప్రత్యర్థి బౌలర్లపై పగ సాధిస్తున్నట్లు.. షఫాలీ రెచ్చిపోయింది. మైదానం నలువైపులా బౌండ్రీలతో హోరెత్తించింది. ఆమెతో పాటు మరో ఓపెనర్ లానింగ్ కూడా ధాటిగా ఆడటంతో బెంగళూరు జట్టు బేల చూపులకు పరిమితమైంది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 162 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు ఔటైన తర్వాతనైనా బెంగళూరు పుంజుకుంటుందేమో అనుకుంటే.. అదీ అత్యాశే అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన మరీనె కాప్ ఫోర్లు, సిక్సర్లతో హడలెత్తించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. అనంతర లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 రన్స్ చేసింది. కెప్టెన్ స్మృతి మందన (35), ఎలీసా పెరర్రీ (31), హీతర్ నైట్ (34), మేగన్ షుట్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో తారా నోరిస్ 5 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కైవసం చేసుకుంది.

ఉత్కంఠ పోరులో గుజరాత్ బోల్తా..

చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) టాప్ స్కోరర్ కాగా.. యూపీ బౌలర్లలో దీప్తి, సోఫీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175 రన్స్ చేసింది. యూపీ విజయానికి మూడు ఓవర్లలో 53 పరుగులు అవసరమైన దశలో గ్రేస్ హారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హారిస్తో పాటు నవగిరె (53), సోఫీ (22 నాటౌట్) రాణించడంతో యూపీ జయకేతనం ఎగురవేసింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు పడగొట్టిన ఫలితం లేకపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News