Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 11-12-2022 )

Horoscope Today | రాశిఫలాలు ( 11-12-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. సమావేశాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలుచేస్తారు. ధనలాభ సూచన ఉంది.

వృషభం

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వాహన యోగం ఉంది.

మిథునం

ఆస్తి తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో ఒడిదొడుగులు తొలగుతాయి. వస్తులాభ సూచన ఉంది.

కర్కాటకం

కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం

కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. రుణాలను తీరుస్తారు.

కన్య

పెట్టుబడులకు అనుకూలమైన సమయం. గృహ, వాహన యోగాలు పొందుతారు. చర్చల్లో పురోగతి లభిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు

తుల

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

వృశ్చికం

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శుభవార్తలు వింటారు.

ధనుస్సు

ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వాహన యోగం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మకరం

కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

కుంభం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తు కొనుగోలు సూచన ఉంది.

మీనం

గృహనిర్మాణ ఆలోచనలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. భూ క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Exit mobile version