Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & Vaasthuhoroscope today | రాశి ఫలాలు ( 10-01-2023 )

horoscope today | రాశి ఫలాలు ( 10-01-2023 )

horoscope today | మేషం

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంతానానికి నూతన విద్య, అవకాశాల సూచన ఉంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం

అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తిచూపిస్తారు.

మిథునం

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. సోదరుల సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి.

కర్కాట్కం

వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

సింహం

అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

కన్య

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి,వ్యాపారాలు లాభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. సంతానాన్ని కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు సేకరణ కలదు.

తుల

భూవివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలుకువ అవసరం. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. అరుదైన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

మకరం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వస్తు లాభ సూచన ఉంది.

కుంభం

అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. మౌనంగా ఉండటం మంచిది. మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది.సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మీనం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News