Home Lifestyle Health Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ?

Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ?

Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ? వృద్ధులు, మహిళలు చిన్నపిల్లలకే ఎక్కువగా ఎందుకు వస్తుంది?

డెంగీ జ్వరం వచ్చినప్పుడు నొప్పి తగ్గించే గోళీలను అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే.. డెంగీ వచ్చినప్పుడు శరీరంలో రక్తస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. అలాంటి సమయంలో ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. డెంగీ నిర్ధారణ కాగానే నొప్పి నివారణ ట్యాబ్లెట్లకు బదులుగా వేరే ట్యాబ్లెట్ల కోసం వైద్యులను సంప్రదించాలి.

డెంగీ జ్వరంతో బాధపడుతున్నప్పడు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అటూ, ఇటూ తిరగడం కాకుండా విశ్రాంతి తీసుకోవాలి.

డెంగీ రావడానికి కారణం ఈ దోమే.. ఇది చాలా వెరైటీ దోమ!

డెంగీ జ్వరానికి కారణమయ్యే దోమ పేరు ఈడీస్‌ ఈజిఫ్టై. ఇది అన్ని దోమల కంటే కాస్త భిన్నమైన గుణాలు కలిగి ఉంటుంది. ఈ దోమ తన జీవిత కాలంలో 100 మీటర్లకు మించి దూరం ప్రయాణించలేదు. మురుగు నీటిలో పెరగదు కానీ.. నిల్వ ఉంచిన నీటిలో మాత్రం త్వరగా పెరుగుతుంది. పాత టైర్లు, కూలర్లు, కొబ్బరి చిప్పలు, సంపుల్లో ఈ దోమలు ఎక్కువ‌గా పెరుగుతాయి. ఈ దోమలు ఎక్కువగా పగటిపూటే కుడతాయి. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు డెంగీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం ఎక్కువ ?

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Exit mobile version