Home Lifestyle Health Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం...

Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం ఎక్కువ ?

Rising Dengue Cases | డెంగీ.. ఈ పేరు వింటేనే ఆస్పత్రులు గుర్తొస్తాయి. వాళ్లు వేసే బిల్లు కళ్లముందుంటుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెంగీ.. మన ఇంటి వైపు తొంగిచూడకుండా చేసేయొచ్చు. చూడ్డానికి సింపుల్‌గా అనిపించినా.. ఇలా చేస్తే మీరు ఆస్పత్రులవైపు తొంగిచూడాల్సిన అవసరం ఉండదు. అవేంటో ఓసారి లుక్కేయండి మరి..

  1. ఖాళీ నూనె డబ్బాలు , నీళ్ల డబ్బాలు‌, శీతల పానీయాల బాటిళ్లను మూత తీసి పడేయకుండా.. జాగ్రత్తగా మూత బిగించాలి. దీని వల్ల వాటిలో నీరు నిల్వ ఉండదు.
  2. కొంత మంది ఇంట్లో మొక్కలను పెంచుకుంటారు. వాటికి పోసే నీరు ఇంట్లో పడకుండా మొక్కల కింద ప్లేట్లు పెడతారు. అయితే ప్లేట్లలో పడిన నీళ్లను, కుండీల్లో ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు తీసేసి.. శుభ్రం చేసుకోవాలి.
  3. ఇంట్లో నీటిని నిల్వ చేసే తొట్టెలు, డ్రమ్ములు, ట్యాంకులు, పాత్రలను ఎల్లప్పుడూ మూసే ఉంచాలి.
  4. ఏసీలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
  5. వాష్‌ బేషిన్ల కింద నీళ్ల పైపుల వద్ద ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవాలి. ఇంటి బయట మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
  6. దోమలు ఎక్కువగా ఉంటే మాత్రం కాళ్లు, చేతులను కప్పి ఉంచేలా వదులైన దుస్తులు ధరించాలి.
  7. చెత్త, మురుగు నీరు ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు దోమలు కుట్టకుండా కాళ్లు, చేతులకు దోమల మందులను పూసుకోవాలి.
  8. ఇంటి పరిసరాల్లో నీరు నిల్ల ఉన్నట్లైతే వెంటనే దోమ మందును పిచికారీ చేయించాలి.
  9. దోమ తెరలను తప్పకుండా వాడాలి.

ఎవరిలో ముప్పు ఎక్కువ పొంచి ఉంది ?

ముఖ్యంగా 12 ఏండ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులకు డెంగీతో ముప్పు ఎక్కువ. గర్భిణులు, మధుమేహులు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు. రక్తహీనతతో బాధపడుతున్నవారు డెంగీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే.

డెంగీ లక్షణాలివే

జ్వరం, తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి .. టెస్టులు చేపించుకోవడం ఉత్తమం.

శరీరంపై ఎర్రటి మచ్చలు వస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఆయాసం, కళ్లు తిరగడం, బీపీ తగ్గడం, చిగుర్లు, ముక్కు, ఇతర అవయవాల నుంచి రక్తస్రావం అయితే మాత్రం అస్సలు ఆలస్యం చేయొద్దు. వైద్యుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

ముఖ్యంగా డెంగీ అని నిర్ధారణ అయితే మాత్రం నొప్పులకు సంబంధించిన గోళీలకు దూరంగా ఉండాలి.

Rising Dengue Cases

Exit mobile version