Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHealthHealth tips for heart | గుండె పదిలంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డిప్రెషన్...

Health tips for heart | గుండె పదిలంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డిప్రెషన్ గా అనిపిస్తే వెంటనే ఇలా చేయండి!

Health tips for heart | కరోనా తర్వాత చాలా మంది గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారు కూడా గుండె పోటుతో ( Heart attack ) తో మరణించడం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ఉండాలంటే గుండెను పదిలంగా ఉంచుకోవాలి. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడంతో పాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటవి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Read more: Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

  • నీరు ఎక్కువగా తాగడం గుండెకు చాలా మంచిది.
  • జంక్ ఫుడ్ ను వీలైనంత వరకు దూరంగా పెట్టడం మంచిది. దీనికి బదులు పండ్లు, ఆకు కూరలను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి.
  • రాత్రిళ్లు ఇష్టానుసారం నిద్రపోవడం కాకుండా.. సమయపాలన పాటించాలి. ఉదయాన్నే త్వరగా నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిది.
  • చిన్న చిన్న వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి, వాకింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం వంటివి చేయచ్చు.
  • ఇంట్లో మొక్కల్ని పెంచుకోవడం, పుస్తకాలు చదవడం, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి గుండెను ఆహ్లాదపరుస్తాయి.

Read more: Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం ఎక్కువ ?

  • రెగ్యులర్ గా బరువు చెక్ చేసుకోవాలి. మన ఎత్తు, పొడవుకు తగిన బరువును మెయిన్టేన్ చేస్తూ ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్( BMI ) 18.5 నుంచి 24.9 కి మధ్యలో ఉంచుకోవాలి.
  • ఎన్ని చికాకులు ఉన్నా వారాంతంలో సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. అందుకోసం కుటుంబంతో వీకెండ్స్ సరదాగా గడిపేలా చూసుకోవాలి. దీనివల్ల గుండెను ఒత్తిడి నుంచి దూరం చేసి సాధారణ స్థితికి తీసుకురాగలుగుతారు.
  • డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు సన్నిహితులకు, ఇష్టమైన వారికి వీడియో కాల్ చేసి మాట్లాడటం, గ్రూపులుగా ఏర్పడి యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం ఉపశమనం కలిస్తుంది.

Read more: Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

  • పొగతాగడం, మద్యం సేవించడం మానేయాలి. పొగతాడం శ్వాస సంబంధిత సమస్యల్ని తెచ్చిపెడితే.. మద్యం సేవించడం ద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది
  • షుగర్, బీపీ తదితర సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా మెడిసిన్ తీసుకోవడమే కాకా, రెగ్యులర్ గా షుగర్, బీపీ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి.
  • గుండెలో కొంచెం నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్ల వాపు, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం చేయాలి.

Follow Us : FacebookTwitter

Read more articles | Chiranjeevi | ఆటోజానీ ఎక్కడ.. ఉందా? పక్కన పడేసావా.. పూరీ జగన్నాథ్ కు చిరు స్ట్రెయిట్ క్వశ్చన్..

Health tips | రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినొచ్చా.. తింటే ఏమైనా ఉపయోగం ఉంటుందా ?

Health tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌ తాగొచ్చా?

Diabetes | డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు సీతాఫ‌లాలు తినొచ్చా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News