Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentSamantha | సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి అంత ప్రమాదకరమా? అది ఎలా వస్తుంది?

Samantha | సమంతకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి అంత ప్రమాదకరమా? అది ఎలా వస్తుంది?

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి బాంబు పేల్చింది. లక్షలో నలుగురు ఐదుగురికి మాత్రమే వచ్చే ఈ అరుదైన వ్యాధితో సమంత బాధపడుతోందని తెలిసి అంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అసలు మయోసైటిస్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? దాని లక్షణాలేంటి? అనే వాటి గురించి తెగ ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో ఆ మయోసైటిస్ వ్యాధి గురించి మీకోసం..

అటు ఉన్న వస్తువు.. ఇటు పెట్టాలన్నా ఒళ్లు సహకరించకపోవడం.. ఎక్కువ సేపు నిలబడ్డా, కూర్చొన్న కండరాలు పట్టేసినట్టు అనిపించడం.. ఇలాంటి లక్షణాలను సాధారణంగా యాభై ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నప్పుడు చూస్తుంటాం. అదే యువకులు, మధ్యవయస్కుల్లో పూర్తి ఆరోగ్యం బాగోలేక నీరసంగా మారినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మళ్లీ ఒకటి రెండ్రోజుల్లోనే అంతా సెట్ రైట్ అవుతుంది. అలా కాకుండా రోజూ ఇలాంటి లక్షణాలు ఉంటే.. అది మయోసైటిస్. దీన్నే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అని పిలుస్తారు. ఈ అరుదైన వ్యాధి సోకితే నొప్పులు, అలసటతో వ్యాధిగ్రస్తులకు చాలా బాధ కలుగుతుంది. ఈ వ్యాధిని ఐదు రకాలుగా విభజిస్తున్నారు. అవేంటంటే..

  1. పాలిమయోసైటిస్
  2. ఈ వ్యాధి సోకితే చాలా బలహీనంగా అవుతారు. చిన్న పని చేసినా నీరసించిపోతారు. కండరాలు నొప్పులు విపరీతంగా ఉంటాయి. నాలుగు అడుగులు కూడా వేయలేరు. ఒక్కోసారి నడవలేక కిందపడిపోయే అవకాశం కూడా ఉంటుంది.
  3. డెర్మటోమయోసైటిస్
    ఇది కండరాల మీద మాత్రమే ప్రభావం చూపించదు. చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి. మహిళలు, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
  4. నెక్రోటైజింగ్ మయోపతి
    మధ్యస్థ భాగాల్లోని కండరాలపై ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల తొడలు, మోచేతులు, మోకాళ్లు, నడుము, భుజాలు బలహీనంగా మారతాయి. నొప్పి పెడతాయి.
    4.ఇన్క్లూజన్ బాడీ మయోసైటిస్
    మోచేతి, మోకాలి కండరాలు పట్టేసినట్టుగా అనిపిస్తాయి. యాభై ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తుంది.
    5.జువైనల్ ఫామ్స్ ఆఫ్ మయోసైటిస్
    పిల్లలు, యుక్త వయసు వారిలోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

లక్షణాలు
కండరాల బలహీనత, అలసట అందరిలో కనిపిస్తాయి. ఇవి కాకుండా ముఖం, ఛాతీ, భుజాలు, మెడ వెనుక భాగంలో దద్దుర్లు ఏర్పడటం, ఆహారం మింగేటప్పుడు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎలా వస్తుంది?
వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, శిలీంద్రాల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెబుతుంటారు. జన్యుపరంగా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంటారు. కానీ సరైన కారణాలను మాత్రం ఇప్పటివరకు గుర్తించలేదు. కాకపోతే ఈ వ్యాధి 30 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలు మయోసైటిస్ బారిన పడుతున్నట్టు పలు సర్వేల్లో వెల్లడైంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News