Monday, May 6, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowDiabetes | డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు సీతాఫ‌లాలు తినొచ్చా?

Diabetes | డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు సీతాఫ‌లాలు తినొచ్చా?

Diabetes | చ‌లికాలంలో మాత్ర‌మే క‌నిపించే సీతాఫ‌లాలు తినేందుకు చాలామంది ఇష్ట‌ప‌డ‌తారు. అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు క‌లిగిన ఈ పండును తిన‌డం వ‌ల్ల చాలా ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. సీతాఫ‌లాలు తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాలు ఏంటో ఒక‌సారి చూద్దాం..

సీతాఫ‌లంలో ఉండే విట‌మిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తాయి.

దీని గ్లెసెమిక్ ఇండెక్స్ జీఐ 54 ఉంటుంది. కాబ‌ట్టి డ‌యాబెటిస్ రోగులు కూడా నిర‌భ్యంతరంగా సీతాఫ‌లం తినొచ్చని పోష‌కాహార నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు.
వీటిలో డైట‌రీ ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది మ‌ధుమేహ రోగుల‌కు మేలు చేస్తుంది.
సీతాఫ‌లంలో విట‌మిన్ బీ స‌మృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే బీ6 క‌డుపు ఉబ్బ‌రాన్ని త‌గ్గిస్తుంది.
గ‌ర్భిణులు వీటిని తిన‌డం ద్వారా పిల్ల‌ల మెద‌డు వృద్ధి చెందుతుంది. నాడీ వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంది. వీటిలో విట‌మిన్ సీ, మాంగ‌నీస్ ఉండ‌టం వ‌ల్ల ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డి గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో విట‌మిన్ బీ6 అధికంగా ఉంటుంది. ఇది బ్రొంకైల్ ఇన్‌ఫ్ల‌మైష‌న్‌ను త‌గ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్‌ను నివారిస్తుంది.
సీతాఫ‌లంలో నియాసిన్‌, డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉండ‌టం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది.
సీతాఫ‌లం వాతం, ఆర్థ‌రైటిస్ వంటి వ్యాధుల‌ను నివారిస్తుంది. కండ‌రాల బ‌ల‌హీన‌త‌ను తగ్గిస్తుంది.
కేన్స‌ర్లు రాకుండా అడ్డుకుంటుంది. లివ‌ర్ క్యాన్స‌ర్‌, రొమ్ము క్యాన్స‌ర్ రాకుండా స‌హాయ‌ప‌డుతుంది.
ఒత్తిడి, మాన‌సిక ఆంద‌ళ‌న‌తో బాధ‌ప‌డుతున్న‌వారిలో డిప్రెష‌న్‌ను దూరం చేస్తుంది.
సీతాఫ‌లం తిన‌డం వ‌ల్ల దంత క్షయం బారి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.
వీటిని తిన‌డం వ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది. జుట్టు రాలే స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News