Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLifestyleHealthHealth Tips | వామ్మో.. విటమిన్‌ Cతో ఇన్ని ప్రయోజనాలున్నాయా? ఏ వయసు వారికి ఎంత...

Health Tips | వామ్మో.. విటమిన్‌ Cతో ఇన్ని ప్రయోజనాలున్నాయా? ఏ వయసు వారికి ఎంత మోతాదులో విటమిన్‌ సీ అవసరం ?

Health Tips | విటమిన్‌ సీ.. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలన్నా? గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగాలన్నా.. చర్మ, కంటి ఆరోగ్యం మంచిగుండాలన్నా ఇది తప్పనిసరి. అనేక పరిశోధనల్లో ఇదే వెల్లడైంది. ఇంతకీ ఇది శరీరానికి ఎంత అవసరం.. ఎంత అవసరం, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి ? ఏ వయసు వారికి ఎంత మోతాదులో విటమిన్‌ సీ అవసరం అనే విషయాలు మీకోసం..

గుండెజబ్బులతో పాటు కేన్సర్‌ లాంటి జబ్బుల్ని నివారించేందుకు జీవన నాణ్యతను పెంచడంలో విటమిన్‌ సీ ఎంతో ఉపయోగపడుతుంది. చర్మం నిగనిగలాడాలన్నా.. కంటి చూపు బాగుండాలన్నా శరీరంలో సరిపడా విటమిన్‌ సీ ఉండాల్సిందే.

ధమనులకు రక్షణగా..

ముఖ్యంగా రక్తంలో విటమిన్‌ సీ తక్కువగా ఉన్నవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువేనని పరిశోధనల్లో వెల్లడైంది. కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ఇది కాపాడటమే. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరగకుండా ఉంటుంది. తద్వారా గుండె జబ్బులను నివారించగలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ వల్ల ధమనులకు నష్టం వాటిల్లకుండా విటమిన్‌ సీ రక్షిస్తుంది.

బీపీ పేషెంట్లకు ఔషధమే..

బీపీ ఎక్కువ ఉన్నవారిని పండ్లు, కూరగాయలను రోజూవారి ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యులు ఎందుకు చెబుతారో తెలుసా? రక్తంలో విటమిన్‌ సీ తగ్గినప్పుడు బీపీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్‌ సీ దొరికే ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు.

రోగనిరోధక శక్తి బలోపేతం..

సాధారణంగా జలుబు అయితే.. నిమ్మకాయలు, జామపండ్లు, ఉసిరి కాయలు, బత్తాయిలాంటి సీ విటమిన్‌ దొరికే పండ్లను తినొద్దని చాలా మంది అనుకుంటారు. కానీ అది చాలావరకు కరెక్టు కాదు. విటమిన్‌ సీ ఎక్కువగా దొరికే పండ్ల వల్ల జలుబు వచ్చే అవకాశం తగ్గుతుంది. కారణం రోగ నిరోధక వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతుంది. అస్తమా, ఎక్సిమా, అలర్జీల చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.

ఎక్కువగా లభించే పదార్థాలివే

నారింజ, జామ, టమాట, గోబీపువ్వు, క్యాబేజీ, నిమ్మ, ద్రాక్ష, పుచ్చపండు, నారింజ, మామిడి పండ్లలో విటమిన్‌ సీ ఎక్కువగా లభిస్తుంది.

ఎవరికి ఎంత అవసరం..

పద్నాలుగేండ్ల లోపు వయసున్న వారికి 45 మిల్లి గ్రాముల వరకు అవసరం. మహిళలకు 75 మిల్లీ గ్రాములు, గర్భిణులకు 85 మిల్లీ గ్రాములు, పాలిచ్చే తల్లులకు 115 మిల్లీ గ్రాములు, పురుషులకు 90 మిల్లీ గ్రాముల విటమిన్‌ సీ రోజువారీగా అవసరం అవుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter
Read More Articles:

Cancer | చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కేన్సర్‌ను నిరోధించే ఛాన్స్‌.. ఏం చేయాలి !

Diabetes | ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని జయించొచ్చు.. ఏంటవి?

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News