Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentEverything Everywhere All At Once | అత్యధికంగా ఆస్కార్ అవార్డులు అందుకున్నది ఈ చిత్రమే.....

Everything Everywhere All At Once | అత్యధికంగా ఆస్కార్ అవార్డులు అందుకున్నది ఈ చిత్రమే.. అన్ని అవార్డులు గెలుచుకునేంతలా ఏముంది?

Everything Everywhere All At Once | ఆస్కార్ అవార్డుల ( Oscars 2023 ) ప్రదానోత్సవం అట్టహాసంగా ముగిసింది. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల ( Academy Awards ) ప్రదానోత్సవంలో భారతీయ సినీ పరిశ్రమ సత్తా చాటింది. రెండు కేటగిరీల్లో అవార్డులను గెలుచుకుంది. అందరూ అనుకున్నట్లుగానే ఆర్ఆర్ఆర్ ( RRR )సినిమాలోని నాటు నాటు సాంగ్ ( Naatu Naatu Song ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. ఇక అందరి ఫోకస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉండగా.. సైలెంట్‌గా వచ్చిన ది ఎలిఫెంట్ విష్ఫరస్ ( The Elephant Whisperers ) మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ఆస్కార్ గెలుచుకుంది. మన ఇండియన్ సినిమాలను పక్కన బెడితే మొత్తం ఆస్కార్ అవార్డుల్లో ఈసారి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ చిత్రం సత్తా చాటింది. 23 కేటగిరీలకు గానూ 11 కేటగిరీల్లో ఈ చిత్రం నామినేట్ అయిన ఈ చిత్రం.. అత్యధికంగా ఏడు అవార్డులను గెలుచుకుంది.

ఏ విభాగాల్లో అవార్డులు వచ్చాయంటే..

బెస్ట్ మూవీ
బెస్ట్ డైరెక్టర్ – డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెట్
బెస్ట్ యాక్ట్రెస్ – మిచెల్ యో
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – జెమిలీ కర్జీస్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – కే హ్యూ క్యాన్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
బెస్ట్ ఎడిటింగ్

ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి?

ఆస్కార్ అవార్డుల రేసులో ఉన్న ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ది వన్స్ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం పక్కా అని ముందు నుంచే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా బెస్ట్ మూవీగా అవార్డు గెలుచుకుంది. దాంతో పాటు మరో ఆరు అవార్డులను కూడా సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఇంతటి బజ్ రావడానికి, ఏడు ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడానికి ముఖ్య కారణం దీని స్క్రీన్ ప్లే. విభిన్నమైన కథాంశం. ర్‌లాల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్‌తో కామెడీ జోనర్‌లో తెరకెక్కించిన ఈ సినిమాను దర్శకులు చాలా సున్నితంగా నడిపించారు. మనుషుల్ని పోలిన మనుషులు మల్టీవర్స్‌లో ఉంటారనే పాయింట్‌తో ఈ చిత్రం నడుస్తుంది. దీనికి ఆసియా, అమెరికా వలసదారుల నేపథ్యాన్ని జోడించి కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సంక్లిష్టమైన అంశాలను కూడా ఎలాంటి తికమక లేకుండా అర్థవంతంగా చూపించారు. స్క్రీన్‌ప్లే పరంగా కొత్త టెక్నిక్స్‌ను వినియోగించారు. దీంతో ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే కమర్షియల్‌గా కూడా ఈ సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంది. 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News