Thursday, April 18, 2024
- Advertisment -
HomeEntertainmentBrahmanandam Assets | అమ్మో.. బ్రహ్మానందం అన్ని వందల కోట్లు సంపాదించాడా?

Brahmanandam Assets | అమ్మో.. బ్రహ్మానందం అన్ని వందల కోట్లు సంపాదించాడా?

Brahmanandam Assets | స్క్రీన్‌పై అతను కనిపిస్తే చాలు మొహాల్లో చిరునవ్వు విరబూస్తుంది. డైలాగులు చెబితే పొట్టచెక్కలు అయ్యేలా నవ్వొస్తుంది. అతని కామెడీ చిన్నారుల ఏడుపును ఆపేస్తుంది. టెన్షన్లతో ఇంటికి వచ్చిన చిరుద్యోగికి రిలీఫ్‌ ఇస్తుంది. ఇంట్లో ఉండే ముసలోళ్లకి మంచి వినోదాన్ని ఇస్తుంది. ఇక అతను ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ మీమర్స్‌కు ఒక వరం. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఎస్.. మీరు అనుకున్న అతనే.. మన బ్రహ్మీ.. బ్రహ్మానందం.

అహ నా పెళ్లంట సినిమాలో అరగుండు పాత్రతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం.. కమెడియన్‌గా చక్రం తిప్పుతున్నాడు. అప్పట్లో ఈయన కోసమే ప్రత్యేకంగా పాత్రలు కూడా రాసేవారు. దాదాపు 35 ఏండ్ల సినీ కెరీర్‌లో 1200కిపైగా సినిమాల్లో నటించాడు. అనారోగ్యంతో ఈ మధ్య సినిమాలు తగ్గించేశాడు కానీ ఊ అంటే ఇప్పుడు వరుస అవకాశాలు ఇచ్చేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ముందుంటారు. కానీ బ్రహ్మీ ఇప్పుడు కామెడీ కంటే కూడా తనలోని నటుడిని ఆవిష్కరించే పనిలో పడ్డాడు. హార్ట్‌ స్ట్రోక్‌ నుంచి కోలుకున్న తర్వాత ఎమోషనల్‌ పాత్రలపై ఫోకస్‌ పెట్టాడు. ఈమధ్య పంచతంత్రం సినిమాతో కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మీ.. ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తండం సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్‌గా బుధవారం నాడు తన 67వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బ్రహ్మానందం ఆస్తుల వివరాలు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

బ్రహ్మానందం స్థిర, చరాస్తులు కలిపి రూ.600 కోట్ల వరకు ఉంటుందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈయనకు కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉందట. అలాగే జూబ్లీహిల్స్‌లో ఓ లగ్జరీ ఇల్లు ఉంది. కార్ల విషయానికొస్తే ఆడి క్యూ7, ఆర్‌8తో పాటు మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ఉందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కానీ దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News