Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentK.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

K.Viswanath | కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌కు చిన్నప్పటి నుంచి ఆపరేషన్లు అన్నా.. ఆస్పత్రులు అన్నా చచ్చేంత భయం. అందుకే సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండేవాడు. ఇదే విషయాన్ని అప్పట్లో తనను కలవడానికి ఇంటికి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విశ్వనాథ్ చెప్పాడు. విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ ఆరా తీసినప్పుడు ఈ విషయం వివరించాడు.

2019 ఆగస్టులో ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్పుడు తన ఆరోగ్యం అంతా బాగానే ఉందని.. కాకపోతే మోకాళ్ల నొప్పులు ఉన్నాయని కె.విశ్వనాథ్ చెప్పాడు. ఆపరేషన్ చేస్తామని అంటున్నారని.. కానీ తనకు ఆపరేషన్ అంటే భయమని చెప్పుకొచ్చాడు. అసలు హాస్పిటల్స్ అంటే కూడా భయమని తెలిపాడు. అందుకే తన సినిమాల్లో ఎక్కడా ఆస్పత్రి సీన్లు పెట్టనని పేర్కొన్నాడు. ఇక ఆపరేషన్ ఏం చేయించుకుంటాం.. ఇలాగే గడిపేస్తానని చెప్పాడు. కానీ ఆపరేషన్లు, హాస్పిటల్స్ అంటే అంతలా భయం ఉన్న కె.విశ్వనాథ్ ఆస్పత్రిలోనే కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌ – Time2news.com

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News