Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentK.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినిమాలంటే చాలామంది ఇష్టపడతారు. ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్విని ఎంతోమంది ఆరాధిస్తారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకరు. కె.విశ్వనాథ్‌కు ఆయన ఒక అభిమాని. అందుకే 2019 ఆగస్టులో ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. సత్కరించారు కూడా. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్‌పై తనకున్న అభిమానాన్ని కేసీఆర్ చాటుకున్నారు. కె.విశ్వనాథ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు అంటే ఇష్టం అని చెప్పాడు. మీరు తీసిన ప్రతి సినిమా చూశానని తెలిపారు. ముఖ్యంగా శంకరాభరణం సినిమా 25 సార్లకు పైగా చూసి ఉంటానని అన్నారు. ఇదొక్కటే కాదు దాదాపు అన్ని సినిమాలు ఇలాగే చూశానని తెలిపారు. ఇప్పటికీ టైమ్ దొరికితే మీ సినిమాలు చూస్తానంటూ కె.విశ్వనాథ్‌కు చెప్పారు. శంకరాభరణం సినిమా చూసినప్పుడే మిమ్మల్ని కలవాలని అనుకున్నా.. ఇన్నేళ్లకు తన ఆశ నెరవేరిందని చెప్పారు. తనపై ఉన్న అభిమానమే ఇన్నేళ్లకు కలిసేలా చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

కె.విశ్వనాథ్ సినిమాలను ఒక తపస్సులా చేస్తారని అందుకే ప్రతి సినిమా ఓ కావ్యంలా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ పదేళ్లుగా విశ్వనాథ్ సినిమాలు రావడం లేదని బాధపడ్డాడు. ఈరోజుల్లో సందేశాత్మక, గొప్ప సినిమాలు రావడంలేదు. మీరు ఎలాగైనా మళ్లీ సినిమా తీయాలి అని కె.విశ్వనాథ్‌ను సీఎం కేసీఆర్ కోరారు. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా చేద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని ప్రకటించారు. దయచేసి సినిమా కోసం ప్రణాళిక సిద్దం చేయండి అని కె.విశ్వనాథ్‌ను మరీమరీ కోరారు. కానీ అనారోగ్యం కారణంగా అది కుదరలేదు. దీంతో కె.విశ్వనాథ్‌తో సినిమా చేయాలన్న సీఎం కేసీఆర్ కల కలగానే మిగిలిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌ – Time2news.com

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News