Thursday, December 7, 2023
- Advertisment -
HomeEntertainmentJunior NTR | ఎన్టీఆర్ 30 ఎంతవరకు వచ్చింది.. కొరటాల సినిమాపై జూనియర్ ఏమంటున్నాడు..?

Junior NTR | ఎన్టీఆర్ 30 ఎంతవరకు వచ్చింది.. కొరటాల సినిమాపై జూనియర్ ఏమంటున్నాడు..?

Junior NTR | ట్రిపుల్ ఆర్ తర్వాత ఎలాంటి గ్యాప్ రాకూడదని ఒకేసారి రెండు సినిమాలు కు కమిట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన అనుకున్నది ఒక్కటి కూడా జరగడం లేదు. త్రిబుల్ ఆర్ ( RRR ) విడుదలకు ముందు కొరటాల శివ ( Koratala shiva ) బ్లాక్ బస్టర్ డైరెక్టర్. కానీ ఆచార్య సినిమాతో అనుకోని డిజాస్టర్ ఇచ్చాడు. ఈయన దాంతో నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ఈ దర్శకుడు.

పైగా ఎన్టీఆర్ కూడా స్క్రిప్టును అంత ఈజీగా ఫైనల్ చేయడం లేదని తెలుస్తోంది. ఎంత లేట్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ తోనే రావాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తో వచ్చిన పాన్ ఇండియా మార్కెట్ కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు తారక్. అందుకే NTR 30 అంతకంతకు ఆలస్యమవుతున్నా కూడా ఆయన ఏ మాత్రం ఫీల్ అవ్వడం లేదు.

Read more: Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

పైగా ఆయన ఎప్పుడూ కొరటాల శివను ఒక దర్శకుడిగా చూడలేదు. తన కుటుంబ సభ్యుడిగానే చూసాడు. అందుకే అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు కూడా గుడ్డిగా నమ్ముతున్నాడు. కాకపోతే కథ విషయంలో మాత్రం అంత ఈజీగా ఫైనల్ చేయట్లేదు ఎన్టీఆర్. ఇప్పటికే కొరటాల 4 సార్లు తన నెరేషన్ ఇచ్చాడు.. కానీ జూనియర్ మెప్పు మాత్రం పొందలేకపోయాడు. ప్రతిసారి కథలో కొన్ని లోపాలు కనిపించడంతో మార్చమని చెప్తున్నట్లు తెలుస్తోంది.

Read more: T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫస్టాఫ్ లాక్ అయిపోయింది. సెకండ్ ఆ విషయంలో కుస్తీ పడుతున్నారు కొరటాల అండ్ టీం. ఈ స్టోరీ డిస్కషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడు.
నవంబర్ లోపు స్క్రిప్ట్ పూర్తవుతుందని.. అన్ని కుదిరితే డిసెంబర్ చివరి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని కొరటాల భావిస్తున్నాడు.

Read more: Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

ఒకవేళ అప్పుడు కుదరకపోయినా సంక్రాంతి తర్వాత సినిమా షూటింగ్ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాడు కొరటాల. యువసుధా ఆర్ట్స్ మిగిలిన సుధాకర్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కొరటాల ప్రతిసారి తన సినిమాలో సందేశంతో వస్తుంటాడు.. కానీ ఎన్టీఆర్ కోసం పక్కా కమర్షియల్ మాస్ కథ సిద్ధం చేస్తున్నాడు. ఆచార్యతో పోయిన తన ఇమేజ్ ఎన్టీఆర్ సినిమాతో తిరిగి తెచ్చుకోవాలని కసితో ఉన్నాడు ఈయన.

Follow Us : FacebookTwitter

Read More Articles | Godfather | మీడియాను అనాల్సింది అని.. ఆయింట్మెంట్ రాసిన మెగాస్టార్ చిరంజీవి..!

Filmfare awards 2022 | త‌గ్గేదేలే.. ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప‌.. సాయిప‌ల్ల‌వికి రెండు అవార్డులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News