Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentTrivikram | త్రివిక్రమ్‌కు డ్యూయల్ డ్యూటీ తప్పట్లేదా.. ఏంటిది మాస్టారు..?

Trivikram | త్రివిక్రమ్‌కు డ్యూయల్ డ్యూటీ తప్పట్లేదా.. ఏంటిది మాస్టారు..?

Trivikram | తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి.. క్రేజ్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. పైగా స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని మార్కెట్ ఈయన సొంతం. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోల కంటే గురూజీకే ఎక్కువ మార్కెట్ ఉంది. ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఇండస్ట్రీ హిట్ తప్ప మరో ఆప్షన్ లేదు.

రొటీన్ కథలతో కూడా అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో లాంటి రికార్డు బ్రేకింగ్ సినిమాలు ఇచ్చాడు మాటల మాంత్రికుడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తన ఫ్రెండ్ కోసం తగ్గుతున్నాడు. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తూనే.. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా బ్యాక్ బోన్ అయిపోతున్నాడు గురూజీ. స్నేహం కోసం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈయన.

అక్కడ దర్శకుడిగా.. ఇక్కడ రచయితగా సత్తా చూపిస్తున్నాడు. మెగాఫోన్ పట్టిన తర్వాత రైటర్‌గా ఇతర సినిమాలకు ఎప్పుడూ పని చేయని త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే రెండుసార్లు మెట్టు దిగాడు. పుష్కరం కింద తీన్ మార్.. గతేడాది భీమ్లా నాయక్ సినిమాల కోసం రైటర్‌గా పెన్ను పట్టాడు. భీమ్లా నాయక్ విషయంలో సాగర్ కే చంద్ర కంటే ఎక్కువగా త్రివిక్రమ్ చూసుకున్నాడు. అందుకే ఆ సినిమా ఫలితం తాలూకు టోటల్ క్రెడిట్ అంతా గురూజీ ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ వినోదీయ సితం రీమేక్ చేయబోతున్నాడు. దీనికి కూడా స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించబోతున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకుడు. ఓ వైపు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తూ.. మరోవైపు పవన్ సినిమాకు కూడా మాట సాయం చేస్తున్నాడు త్రివిక్రమ్.

రిస్క్ అని తెలిసినా తప్పక చేస్తున్నాడు గురూజీ. అయితే రెమ్యునరేషన్ కూడా అంతే బలంగా తీసుకుంటున్నాడు ఈయన. భీమ్లా నాయక్ కోసం మాటలు, స్క్రీన్ ప్లే రాసినందుకే 12 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు గురూజీ. అలా డ్యూయల్ డ్యూటీతో పవన్, మహేష్ బాబులకు న్యాయం చేస్తున్నాడీయన.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News