Home Entertainment Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా...

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), డైరెక్టర్ హరీశ్ శంకర్ ( Harish Shankar ) కాంబినేషన్ సినిమా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గబ్బర్ సింగ్ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని చాలా రోజులు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ల ఎదురుచూపులకు తగ్గట్టుగానే భవదీయుడు భగత్ సింగ్ అంటూ సినిమాను అనౌన్స్ చేశారు. టైటిల్‌తో పాటు పోస్టర్‌ను కూడా అప్పట్లో విడుదల చేశారు. కానీ అప్పట్నుంచి సినిమాపై ఒక్క అప్‌డేట్ లేదు. మధ్యలో సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌తో హరీశ్ శంకర్ థెరీ రీమేక్ చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో థెరీ రీమేక్ మాకొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ ఆందోళన తెలిపారు. ఇలా ఫ్యాన్స్ ఆందోళన కొనసాగుతున్న ఈ సమయంలో భవదీయుడు భగత్ సింగ్ టీమ్ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది.

భవదీయుడు భగత్ సింగ్ సినిమా టైటిల్‌ను మారుస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఉస్తాద్ భగత్ సింగ్ గా టైటిల్‌ను మారుస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. మనల్ని ఎవడ్రా ఆపేది అనే ట్యాగ్‌ను కూడా జోడించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్టు తెలిపింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. అయాంక్ బోస్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇది థెరీ రీమేక్‌గా తెరకెక్కుతుందా? లేదా పూర్తిగా కొత్త కథతో తెరకెక్కుతుందా ? అనేది తెలియాల్సి ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Indian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

Haripriya Engagement | కేజీఎఫ్ విలన్‌తో ఘనంగా హీరోయిన్ ఎంగేజ్‌మెంట్

Exit mobile version