Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentUnstoppable with NBKS2 | బాలయ్య షోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్‌స్టార్‌ను ఎలాంటి...

Unstoppable with NBKS2 | బాలయ్య షోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్‌స్టార్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో !!

Unstoppable with NBKS2 | పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) అన్‌స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టంట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్ షో సూపర్ హిట్ కావడంతో వెంటనే రెండో సీజన్ కూడా మొదలుపెట్టారు.ఫస్ట్ సీజన్ కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా దీన్ని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ను ఈ షోకి తీసుకొచ్చారు. న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 30 నుంచి ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ను అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకి తీసుకొచ్చారు. నిజానికి అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వస్తాడని సెకండ్ సీజన్ మొదలైనప్పటి నుంచే టాక్ నడుస్తోంది. రెండో ఎపిసోడ్ టైమ్‌లో త్రివిక్రమ్‌కు ఫోన్ చేసిన బాలయ్య.. అన్‌స్టాపబుల్ షోకి ఎప్పుడు వస్తున్నావ్ ? ఎవరితో రావాలో తెలుసుగా అంటూ అడిగాడు. ఇది అప్పట్లో వైరల్‌గా మారింది. అప్పట్నుంచే బాలయ్య షోకి పవన్ రాబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెర దించుతూ ఇవాళ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది.

ఇదే విషయాన్ని అల్లు అరవింద్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అన్‌స్టాపబుల్‌లో మీరందరూ ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయన వచ్చేస్తున్నారు. ఇవాళ బిగ్గెస్ట్ అండ్ క్రేజియెస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ షోకి రావడం ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు.బాలయ్య, పవన్ ఎపిసోడ్‌ ఎలా ఉండబోతుందా అని సినీ,రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఎందుకంటే ఇద్దరూ కూడా సినిమాల్లో ఉన్నారు. అలాగే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ ఎపిసోడ్‌లో బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

హరిహర వీరమల్లు సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలపై అన్‌స్టాపబుల్ షోలో చర్చకు రానున్నట్టు సమాచారం. స్ట్రెయిట్ ఫిలింస్ కంటే రీమేక్స్‌పైనే ఎందుకు ఇంట్రెస్ట్ పెడుతున్నారనే విషయం కూడా బాలయ్య అడగనున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా కూడా పలు ప్రశ్నలు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ది హత్యనే.. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Krithi shetty | ఇంత చిన్న రీజన్‌కే బాలీవుడ్ ఆఫర్‌ వదిలేసుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

Prabhas in Raja Deluxe | వింటేజ్ లుక్‌లో కేక పుట్టిస్తున్న ప్రభాస్.. రాజా డీలక్స్ నుంచి లీకైన పిక్స్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News