Home Entertainment Kajal Aggarwal | రీఎంట్రీలోనే త్రిషకు షాకిచ్చిన కాజల్ ?

Kajal Aggarwal | రీఎంట్రీలోనే త్రిషకు షాకిచ్చిన కాజల్ ?

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. గౌతమ్ కిచ్లూతో పెళ్లి, ఆ వెంటనే తల్లి కావడంతో కొద్దిరోజులుగా కాజల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రీఎంట్రీ పకడ్బందీగా ఉండేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇది కాజల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అయినప్పటికీ తోటి హీరోయిన్లకు మాత్రం ఈ న్యూస్ ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. ముఖ్యంగా చెన్నై సుందరి త్రిషకు కాజల్ రీఎంట్రీ ఇప్పుడు గట్టి షాకిస్తోంది.

సీనియర్ స్టార్ హీరోలకు త్రిష ఇప్పుడు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా మారింది. ఈమధ్య వరుస విజయాలు అందుకుంటుండటంతో త్రిషకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తలపతి విజయ్ సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు తలా అజిత్‌తో ఏకే62కి కూడా త్రిషను హీరోయిన్‌గా అనుకున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ముందుగా నయనతారను అనుకున్నారు. కానీ ఆమె పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పాటు ఇతరత్రా కారణలతో ఈ సినిమాకు కమిట్ కాలేదు. దీంతో ఏకే 62 కోసం త్రిషను ఫిక్సయ్యారు.

అయితే ఇప్పుడు కాజల్ రీఎంట్రీ ఇస్తుందని తెలియడంతో ఆమెనే తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్‌గా మారింది. గతంలో కాజల్, అజిత్ కలిసి వివేకం సినిమాలో నటించారు. ఈ సినిమా తమిళనాట బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ జోడీని రిపీట్ చేయాలని దర్శక నిర్మాతలు చూస్తున్నారు. ఈ ఒక్క సినిమా అనే కాదు కాజల్ రీఎంట్రీ ఇస్తుందని తెలియగానే దర్శక నిర్మాతలకు ఆమె కోసం ట్రై చేస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోలకు ఆమె పర్‌ఫెక్ట్ అని డిసైడ్ పోతున్నారు. దీంతో కాజల్ రీఎంట్రీ సీనియర్ హీరోయిన్లకు మింగుడుపడని వార్తేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

NTRforOscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Exit mobile version