Home Entertainment Chiranjeevi | ఆటోజానీ ఎక్కడ.. ఉందా? పక్కన పడేసావా.. పూరీ జగన్నాథ్ కు చిరు...

Chiranjeevi | ఆటోజానీ ఎక్కడ.. ఉందా? పక్కన పడేసావా.. పూరీ జగన్నాథ్ కు చిరు స్ట్రెయిట్ క్వశ్చన్..

Chiranjeevi | చిరంజీవి ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజ‌కీయాలకు దూరం అయిపోయిన తర్వాత.. సినిమా హీరోగా మామూలుగా బిజీ అవ్వట్లేదు మెగాస్టార్. ఈయన కోసం కథలు రాస్తున్న ప్రతీ దర్శకుడికి ఆఫర్ ఇచ్చేస్తున్నాడు.. అలాగే తన కోసం కథలు రాయాలంటూ కుర్ర దర్శకులను కూడా అడిగేస్తున్నాడు అన్నయ్య.

ఇదిలా ఉంటే ఈ మధ్య గాడ్ ఫాదర్‌తో కలెక్షన్ల మాట ఎలా ఉన్నా.. పాజిటివ్ టాక్‌తో మాత్రం వచ్చేసారు. పైగా ఈయన కారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం బాబీతో వాల్తేరు వీరయ్య.. మెహర్ రమేష్‌తో భోళా శంకర్ సినిమాలు చేస్తున్నాడు చిరు. వీటితో పాటు వెంకీ కుడుముల సినిమా లైన్‌లోనే ఉంది. ఇన్ని సినిమాలు ఉండగానే.. తాజాగా పూరీ జగన్నాథ్ ఆటో జానీ గురించి గుర్తు చేసాడు మెగాస్టార్.

Read more: Junior NTR | ఎన్టీఆర్ 30 ఎంతవరకు వచ్చింది.. కొరటాల సినిమాపై జూనియర్ ఏమంటున్నాడు..?

గాడ్ ఫాదర్‌లో తనతో పాటు నటించిన పూరీతో ఇన్‌స్టా లైవ్ చేసాడు చిరు. దాదాపు గంట సేపు సాగిన ఈ డిస్కషన్‌లో చివరగా పూరీని చిరు అడిగిన ప్రశ్న.. నా ఆటోజానీ ఉందా లేదంటే తీసి పక్కన పడేసావా..? అని. దీనికి పూరీ కూడా ఆన్సర్ ఇచ్చాడు. లేదు సర్.. ఆ సినిమా పక్కన బెట్టేసాను.. మీ కోసం మరో మంచి కథ రాస్తాను అని చెప్పుకొచ్చాడు. అప్పుడెప్పుడో పూరీ జ‌గ‌న్నాథ్ తో ఆటోజానీ సినిమా అనౌన్స్ చేసి ఆపేసాడు చిరంజీవి.

Read more: Indian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

సెకండాఫ్ న‌చ్చ‌క సినిమా వ‌దిలేసాడు మెగాస్టార్. ఆ త‌ర్వాత పూరీ కూడా ఆటో జానీ గురించి ఆలోచించ‌లేదు. త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు. చిరంజీవి కూడా ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ఆటోజానీని అట‌కెక్కించారు. మ‌ళ్లీ ఇప్పుడు ఆ సినిమా గురించి ఆరా తీసాడు చిరు. దానికి పూరీ ఇచ్చిన జవాబుతో ఆటో జానీ పూర్తిగా అంతం అయిపోయిందని అర్థమైపోయింది. ఆ కథ పూర్తిగా పాతదైపోయిందని.. ఇప్పుడు అది వర్కవుట్ అవ్వదని పూరీనే తేల్చేసాడు.

అందుకే చిరంజీవి కోసం మరో కథ రాస్తానని చెప్పుకొచ్చాడు. మరోవైపు చిరంజీవి సైతం గాడ్ ఫాదర్ ఇచ్చిన జోష్‌లో పూరీని నమ్మేస్తున్నాడు. కచ్చితంగా త్వరలోనే కలిసి పని చేద్దాం.. నీకు వేరే ఆప్షన్స్ ఉంటే ఓకే.. లేదంటే మాత్రం నా దగ్గరికి కథ పట్టుకుని వచ్చేయ్ చేసేద్దాం అంటూ మాట ఇచ్చేసాడు. పూరీ కూడా త్వరలోనే చిరంజీవి కోసం కథ రాస్తానని చెప్పాడు. అయితే ఇది చెప్పినంత ఫాస్టుగా అయితే కాదు.. దానికి చాలా టైమ్ పడుతుందని అర్థం అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం.. పూరీ, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles | Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం ఎక్కువ ?

చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Exit mobile version