Home Entertainment Godfather | బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతున్న మెగాస్టార్ దండయాత్ర.. మూడో రోజు కూడా రికార్డు కలెక్షన్లు

Godfather | బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతున్న మెగాస్టార్ దండయాత్ర.. మూడో రోజు కూడా రికార్డు కలెక్షన్లు

Godfather | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘గాడ్ ఫాదర్’ హవానే కనిపిస్తుంది. ‘సైరా’, ‘ఆచార్య’ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ల తర్వాత చిరు ‘గాడ్ ఫాదర్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’కు రీమేక్ గా తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశారు. కాగా ఈ చిత్రంలో మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్ కు మెగా అభిమానులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు. కలెక్షన్ల విషయంలోనూ చిరు బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నాడు. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 50కోట్ల మార్కును క్రాస్ చేసి బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ మేనియా ఏంటో నిరూపించింది. కాగా ఈ చిత్రం మూడో రోజు కూడా ఔరా అనిపించే కలెక్షన్లను రాబట్టింది.

ఈ చిత్రం మూడో రోజు సుమారు రూ.9 కోట్ల వరకు షేర్ ను రూ.17 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో మూడు రోజుల్లో గాడ్ ఫాదర్ చిత్రం రూ. 45 కోట్ల వరకు షేర్ ను రూ.82 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కాగా శనివారంతో ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లోకి అడుగుపెడుతుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.42 కోట్ల వరకు సాధించాల్సి ఉంది. ఇదే జోష్ ను కంటిన్యూ చేస్తే ఈ చిత్రం మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. అయితే హిందీలో మాత్రం ఈ మూవీ కలెక్షన్లు నామ మాత్రంగానే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ గెస్ట్ రోల్ చేసినప్పటికి హిందీలో కలెక్షన్లు రావడం లేదు. ఇక మూడో రోజు ఈ చిత్రం కోటీ రూపాయలను కూడా సాధించలేక పోయింది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించగా.. నయనతార ముఖ్య పాత్రలో నటించింది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో చిరుకు పోటీగా సత్యదేవ్ అద్భుత మైన నటనను కనబరిచాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Indian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

Exit mobile version