Home Entertainment Pia Bajpiee | సమంతలా నేనూ మయోసైటిస్‌తో బాధపడ్డా.. కోలీవుడ్ నటి సంచలనం

Pia Bajpiee | సమంతలా నేనూ మయోసైటిస్‌తో బాధపడ్డా.. కోలీవుడ్ నటి సంచలనం

Pia Bajpiee | మయోసైటిస్‌ ( myositis )తో బాధపడుతున్నట్టు ప్రకటించి సమంత ( Samantha )సంచలనం సృష్టించింది. సామ్‌ ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌తో బాధపడుతున్న విషయం తెలిసి సినీ ప్రముఖులంతా ఆమెకు సానుభూతి తెలిపారు. తొందరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో యాక్టివ్‌ కావాలని ఆకాంక్షించారు. అదే సమయంలో తాను కూడా మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు తెలిపింది కల్పిక గణేశ్‌. ఇప్పుడు మరో కోలీవుడ్‌ హీరోయిన్‌ కూడా మయోసైటిస్‌ బారిన పడ్డానని షాకింగ్‌ విషయం బయటపెట్టింది. ఆమె ఎవరో కాదు పియా బాజ్‌పేయి.

సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలనని.. తాను కూడా గతంలో మయోసైటిస్‌ బారిన పడ్డానని తాజాగా పియా బాజ్‌పేయి చెప్పుకొచ్చింది. ట్రీట్‌మెంట్‌ లేని వ్యాధి బారిన పడితే ఆ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలనని పేర్కొంది. తనకు మయోసైటిస్‌ సోకిన విషయం ఇంట్లో చెప్పలేదని.. ముంబైలో ఉండి చికిత్స తీసుకున్నానని ఆనాటి పరిస్థితిని వివరించింది. తనలాగే సమంత కూడా మయోసైటిస్‌ బారిన పడ్డ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డానని పేర్కొంది. పలు తమిళ డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన పియా.. రంగం సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sukrithi Ambati | ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కిన కేరింత భావన.. ఫొటోలు వైరల్‌

Prabhas Shirt | బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Exit mobile version