Tuesday, May 28, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (03-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (03-02-2023 )

Horoscope Today | మేషం

చెక్కులను అందుకుంటారు. ఆదర్శాలకు ప్రాముఖ్యతను ఇస్తారు. ఇష్టాగోష్టులను సాగిస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలపై ప్రధానంగా దృష్టిని సారిస్తారు. సానుకూల ఫలితాలను అందుకుంటారు.

వృషభం

ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. పెండింగ్ బిల్స్ మంజూరవుతాయి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను ఇష్టపడతారు. సరికొత్త ఆదాయ మార్గాలను సాధిస్తారు. లౌక్యంగా వ్యవహరించి లాభపడతారు.

మిథునం

దీర్ఘాలోచనలు సాగిస్తారు. ఫోన్ సంభాషణలు ఎక్కువగా సాగిస్తారు. అనుకూలమైన బదిలీ లభిస్తుంది. ప్రతికూలమైనటువంటి వ్యవహారాలను కూడా సానుకూల పరచుకోవడానికి నేడు ప్రయత్నాలు సాగిస్తారు.

కర్కాటకం

కుటుంబపరమైన స్పర్థలు చోటుచేసుకుంటాయి. వ్యాపారస్తులకు ఊరట కలిగిస్తుంది. దూర ప్రాంత విషయాలు సానుకూల పడతాయి. నూతన అగ్రిమెంట్స్ చేసుకుంటారు.

సింహం

నలుగుర్ని కలుపుకుని పనులను సానుకూల పరచుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. బంధువర్గంతో చర్చలు సాగిస్తారు. భూమి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది.

కన్య

వస్తు భద్రత, ఆభరణాల భద్రత పట్ల శ్రద్ధ కనబరచండి. జమా ఖర్చులను సరిచూసుకుంటారు. మీరు ప్రారంభించాలని అనుకున్న ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. వాహన యోగ సూచన ఉంది.

తుల

మీకు ఇష్టం లేని పనుల నుంచి తప్పుకోగలుగుతారు. ఎదుటి వారి మనస్సు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ నేడు ఏదో ఒక రూపేణ లాభపడతారు.

వృశ్చికం

కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. మేధస్సుకు పదును పెట్టాల్సిన విధంగా పరిస్థితులు చోటు చేసుకుంటారు. ప్రయోజనాలను పరీక్షించుకోవడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు.

ధనుస్సు

శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలను నిర్మొహమాటంగా వెల్లడించాల్సి వస్తుంది. అమ్మకాలకు సంబంధించి చర్చలు ఊపందుకుంటాయి. రోజువారీ ప్రయాణాల్లో స్వల్ప ఒడిదొడుకులు ఏర్పడతాయి.

మకరం

అందరూ ఉన్నా మిమ్మల్ని మీరు ఒంటరిగా భావిస్తారు. యోగా, ప్రకృతి వైద్యంపై మక్కువ చూపుతారు. వృత్తి, ఉద్యోగాల పరంగా చురుగ్గా వ్యవహరిస్తారు. తనఖా వస్తువులను విడిపిస్తారు.

కుంభం

ఆశించిన రుణాలు అందుకోగలుగుతారు. స్త్రీలతో విబేధాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ఉన్నత స్థానంలోని వారు మీ శ్రేయోభిలాషులు అవడం వల్ల లబ్ధి పొందుతారు.

మీనం

వృద్ధాశ్రమాలను సందర్శిస్తారు. గృహోపకరణాలు అమ్మే వ్యాపారస్తులకు అనుకూలం. ఆర్థికపరమైన అంశాలు, బ్యాంకు వ్యవహారాలు లాభిస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News