Monday, April 29, 2024
- Advertisment -
HomeEntertainmentRitu Chowdary | ఫొటో దిగినప్పుడు అనుకోలేదు.. ఇదే చివరి ఫొటో అవుతుందని.. కన్నీళ్లు పెట్టిస్తున్న...

Ritu Chowdary | ఫొటో దిగినప్పుడు అనుకోలేదు.. ఇదే చివరి ఫొటో అవుతుందని.. కన్నీళ్లు పెట్టిస్తున్న రీతూ చౌదరి పోస్టు

Ritu Chowdary | జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చూసే వాళ్లకు రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్న రీతూ.. జబర్దస్త్‌లో హైపర్ ఆది టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర అభిమానులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కుర్రకారుకు చేరువైంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే రీతూ చౌదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రీతూ చౌదరి.. వాళ్ల నాన్నను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

ఐ మిస్ యూ డాడీ.. ఈ పిక్చర్ తీసుకునేటప్పుడు నేను ఇలా పోస్టు చేయాల్సి వస్తుందని అనుకోలేదు. లాస్ట్ పిక్ విత్ యూ నాన్నా. ఎలా వదిలి వెళ్లిపోయావు నాన్న. నువ్వు లేకుండా నేను ఉండలేను డాడీ.. ప్లీజ్ నీ కూతురి దగ్గరకి తిరిగిరా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్టు చేసింది. మరో పోస్టులో తన తండ్రితో ఉన్న ఎమోషనల్ బాండ్‌ను వివరించింది.

డాడీ.. ఎంత ట్రై చేసినా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా.. నువ్వు లేవు అనేది ఊహించుకోలేకపోతున్నా. నీ అంత ప్రేమ నాపై ఎవరూ చూపించలేరు. నీ అంత పాంపర్ ఎవరూ చేయలేరు. నేను అలిగితే నువ్వు బతిమిలాడేది. నేను కోప్పడినా, చిరాకు పడినా మళ్లీ ప్రేమతో నవ్వుతావు. ఎవరైనా నన్ను ఒక్క మాట అంటే ఫీలయిపోయి తిట్టేవాడిని. అలాంటిది ఎలా నన్ను ఎలా వదిలిపోవాలని అనిపించింది డాడీ.. ఇప్పుడు నాకు అన్నం ఎవరు తినిపిస్తారు. ఎవరు మోటివేట్ చేస్తారు. మనం ఇద్దరం కలిసి రీల్స్ చేసేది కదా.. నువ్వు చెప్పినట్టు ఉంటాను ప్లీజ్ రా డాడీ.. నీ కూతురు పులి అన్నావు కదా.. నీ పులిని వదిలి వెళ్లిపోతావా.. అమ్మ, అన్నయ్య ఉండలేకపోతున్నారు డాడీ.. ప్లీజ్ రా.. డాడీ.. అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. తన తండ్రితో ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలియజేసే వీడియోను పోస్టు చేసింది. ఇది చూసిన జబర్దస్త్ కమెడియన్లు, నెటిజన్లు రీతూకు ధైర్యం చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ.. ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య ముదురుతున్న వివాదం

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Karthika Deepam | సిగ్గుపడుతున్నా అంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే.. ట్విస్ట్‌ ఇచ్చిన కార్తీక దీపం మోనిత

Keerthy Suresh | విడాకులకు సిద్ధమైన కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. కీర్తి సురేశ్‌తో ప్రేమే కారణమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News