Saturday, January 28, 2023
- Advertisment -
HomeEntertainmentKeerthy Suresh | విడాకులకు సిద్ధమైన కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. కీర్తి సురేశ్‌తో...

Keerthy Suresh | విడాకులకు సిద్ధమైన కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. కీర్తి సురేశ్‌తో ప్రేమే కారణమా?

Keerthy Suresh | కోలీవుడ్ స్టార్ హీరో, తలపతి విజయ్ ( Thalapathy Vijay ) విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్ తెగదెంపులు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ఓ యంగ్ హీరోయిన్ కారణమని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో #JusticeForSangeetha అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.

విజయ్ – సంగీత వివాహం సుమారు 22 ఏళ్ల క్రితం జరిగింది. నిజానికి విజయ్‌కి సంగీత వీరాభిమాని. 1996లో యూకే నుంచి వచ్చిన సంగీత స్వర్ణలింగం విజయ్‌ సినిమాలు చూసి అతన్ని ఇష్టపడింది. చెన్నైలో విజయ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లిన సంగీత.. చాలా కష్టపడి తలపతిని కలిసింది. తను ఎంత పెద్ద ఫ్యాన్ అనేది వివరించింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత పెద్దలను ఒప్పించి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం 1999 ఆగస్టు 25న పెళ్లి చేసుకున్నారు. కోలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ జంట అర్ధాంతరంగా విడాకులు తీసుకోబోతున్నారని కోలీవుడ్‌లో కొంతకాలంగా ఓ ప్రచారం జరుగుతోంది. విజయ్, సంగీతలో వచ్చిన మార్పు కారణంగా ఈ రూమర్స్ వస్తున్నాయనే టాక్ నడుస్తోంది.

ఇటీవల విజయ్ నటించిన వారిసు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంగీత రాలేదు. అంతకుముందు డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ సీమంతం వేడుకకు కూడా విజయ్ ఒక్కడే వెళ్లాడు. ఇలా చాలారోజులుగా ఇద్దరూ కలిసి కనిపించకపోవడంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా వార్తలు ఊపందుకున్నాయి. అయితే విజయ్, సంగీత మధ్య విబేధాలు తలెత్తడానికి మహానటి కీర్తి సురేశ్ కారణమనే ప్రచారం నడుస్తోంది.

కీర్తి సురేశ్, విజయ్ ఇద్దరూ కలిసి సర్కార్, భైరవ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల తర్వాత నుంచి కీర్తి సురేశ్‌తో కొంతకాలంగా విజయ్ సన్నిహితంగా ఉంటున్నాడని.. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నట్టు తలపతి67లోనూ కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. కీర్తితో దూరంగా ఉండాలని విజయ్‌కు చాలాసార్లు సంగీత చెప్పిందని.. కానీ అతను వినిపించుకోకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంతోనే విజయ్, సంగీత విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సంగీతతో విడాకుల తర్వాత కీర్తి సురేశ్‌ను విజయ్ పెళ్లి చేసుకుంటాడని కూడా నెట్టింట ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే న్యాయం జరగాలంటూ #JusticeForSangeetha అనే హ్యాష్‌ట్యాగ్‌‌ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. అలాగే కీర్తి సురేశ్‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజమెంటో తెలియాలంటే వీళ్లలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

sudheer varma | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్‌ వర్మ ఎలా చనిపోయాడు? అంత హడావుడిగా అంత్యక్రియలు ఎందుకు జరిపించారు?

Sunil | మళ్లీ బిజీ అయిపోతున్న సునీల్.. కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదుగా..

Rasha Thadani | బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న కేజీఎఫ్‌ నటి కూతురు

Jeremy Renner | కొత్త ఏడాది ప్రత్యేకంగా ఉండాలనుకున్నా.. కానీ 30 బొక్కలు విరిగిపోయాయి.. బాధ వెల్లగక్కిన అవెంజర్‌ సూపర్‌ హీరో

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News