Saturday, January 28, 2023
- Advertisment -
HomeEntertainmentNaatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు...

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

Naatu Naatu Song in Oscar list అంతా అనుకున్నదే జరిగింది. రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్‌ నామినేషన్స్‌లో షార్ట్‌ లిస్ట్‌ అయ్యింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. కాలిఫోర్నియా వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. బెస్ట్ స్కోర్‌ విషయంలో ఇది గుడ్‌ న్యూస్‌ అయినప్పటికీ.. బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో మాత్రం నిరాశే ఎదురైంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ నామినేట్‌ అవుతాడని అంతా అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఫైనల్‌ నామినేషన్స్‌లో తారక్‌ చోటు సంపాదించుకోలేకపోయాడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పాన్‌ ఇండియా తర్వాత విదేశాలకు వెళ్లిన ఈ సినిమా అక్కడి ఆడియన్స్‌ను కూడా ఫిదా చేసింది. రాజమౌళి టేకింగ్‌, ఎన్టీఆర్‌, చెర్రీ యాక్టింగ్‌ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో ఈ సినిమాను పలు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌లో తారక్‌, చెర్రీ వేసిన స్టెప్స్‌ చాలా పాపులర్‌ అయ్యాయి. వీటిని అనుకరిస్తూ భారతీయులే కాదు.. విదేశీయులు కూడా కాళ్లు కదిపారు. నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. ఈ సాంగ్‌కు ఇంత క్రేజ్‌ వచ్చింది కాబట్టే మొన్న గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించింది. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నామినేట్‌ అయ్యింది. ఇక ఆస్కార్‌ గెలుచుకోవడమే మిగిలిపోయింది. ఎం.ఎం.కీరవావణి స్వరపరిచిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ ఆలపించారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా.. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశాడు.

బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో నిరాశే

కొమురం భీమ్‌ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ జీవించేశాడు. ముఖ్యంగా కొమురం భీముడో సాంగ్‌లో ఎన్టీఆర్‌ పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌ విదేశీయులను కూడా ఆకట్టుకున్నాయి. ఇది చూసి హాలీవుడ్‌కు చెందిన వెరైటీ మ్యాగజైన్‌ కూడా ఆస్కార్‌ అందుకోదగ్గ టాప్‌ 10 నటుల జాబితాలో ఎన్టీఆర్‌ పేరును చేర్చింది. ఇది చూసి ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వస్తుందని అంతా అనుకున్నారు. ఎలాగైనా ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ ఇవ్వాలని సోషల్‌ మీడియాలో #NTRforOscars అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్రెండ్‌ చేశారు. చివరి వరకు ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ వస్తుందనే భావించారు. కానీ ఫైనల్‌ నామినేషన్స్‌లోనే తారక్‌కు చోటు దక్కలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

NTR vs ANR | టాలీవుడ్‌లో సరికొత్త రచ్చ.. ఎన్టీఆర్, ఏయన్నార్ ఫ్యామిలీ మధ్య ముదురుతున్న వివాదం

RRR | ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అకాడమీ అవార్డు.. ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడమే నెక్ట్స్?

Karthika Deepam | సిగ్గుపడుతున్నా అంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్టే.. ట్విస్ట్‌ ఇచ్చిన కార్తీక దీపం మోనిత

Keerthy Suresh | విడాకులకు సిద్ధమైన కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్.. కీర్తి సురేశ్‌తో ప్రేమే కారణమా?

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Sunil | మళ్లీ బిజీ అయిపోతున్న సునీల్.. కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదుగా..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News