Dadasaheb Phalke Awards 2023 | సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత సినిమా అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ ఒకటి. ప్రతి సంవత్సరం ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా 2022లో విడుదలైన సినిమాలకు గానూ అవార్డులను అందించారు. ఈ అవార్డుల కార్యక్రమం సోమవారం సాయంత్రం ముంబైలో జరిగింది.
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ కార్యక్రమానికి అవార్డు గ్రహీతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దక్షిణాది నుంచి దుల్కర్ సల్మాన్, నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇతర తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.
2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన నటుడు, చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి , ఆ చిత్రంలో తన నటనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డును పొందారు. బెస్ట్ విలన్ పాత్రకు గానూ దుల్కర్ సల్మాన్ ఈ అవార్డును అందుకున్నారు.
పాన్-ఇండియన్ స్టార్ 2022లో విడుదలై ప్రశంసలు పొందిన బాలీవుడ్ చిత్రం చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌లో తన నటనకు ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. ఆర్ బాల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ కొంచెం నెగిటివ్ స్టేట్స్ లో కనిపిస్తారు.
ఇక బెస్ట్ ఫిలింగా కాశ్మీర్ ఫైల్స్ కి రాగా ఫిలిం ఆఫ్ ద ఇయర్ గా మన రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ కి అవార్డు వచ్చింది.
- ఉత్తమ చిత్రం : ది కాశ్మీర్ ఫైల్స్
- ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ (చుప్)
- ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర)
- ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
- మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(రిషబ్ శెట్టి)
- ఉత్తమ వెబ్ సిరీస్ : రుద్ర,
- క్రిటిక్స్ ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేడియా),
- ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: RRR,
- టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ : అనుపమ
- మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అఫ్ ది ఇయర్ : అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్),
- బెస్ట్ టీవీ యాక్టర్ : జైన్ ఇమామ్,
- బెస్ట్ మేల్ సింగర్ : సచేత్ టాండన్ (మయ్యా మైను – జెర్సీ), బెస్ట్ ఫీమేల్ సింగర్ : నీతి మోహన్ ( మేరీ జాన్ – గంగూబాయి కతియావాడి),
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: PS వినోద్ (విక్రమ్ వేద)
- సినీ పరిశ్రమలో అత్యుత్తమ సహకారం అందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఈ ఏడాదికి గానూ రేఖ అందుకున్నారు.
- సంగీత పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ఈ ఏడాదికిగానూ హరిహరన్ దక్కించుకున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?
NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?
Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి
Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం