Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentKasthuri | తన వ్యాధి గురించి బయటపెట్టిన గృహలక్ష్మీ సీరియల్ నటి కస్తూరి

Kasthuri | తన వ్యాధి గురించి బయటపెట్టిన గృహలక్ష్మీ సీరియల్ నటి కస్తూరి

Kasthuri | హీరోయిన్లు అందరూ ఇప్పుడు వరుసపెట్టి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికే సమంత మయోసైటిస్ నుంచి కోలుకోగా.. రేణు దేశాయ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వీళ్లే కాకుండా మమతా మోహన్‌దాస్, పూనమ్ కౌర్, స్నేహా ఉల్లాల్, హంసానందిని ఇలా చాలామంది హీరోయిన్లు ఏదో ఓ జబ్బుతో బాధపడుతున్నారు. వీళ్లంతా ధైర్యంగా ముందుకొచ్చి తమ అనారోగ్య సమస్యను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే నటి, గృహలక్ష్మీ సీరియల్ ఫేమ్ కస్తూరి కూడా తన అనారోగ్య సమస్యను వెల్లడించింది. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ కూడా పెట్టింది.

చికెన్‌పాక్స్ వ్యాధి ఒక్కోసారి ప్రాణాలను కూడా తీసుకుంటుంది. ప్రస్తుతం ఇలాంటి వ్యాధి బారిన పడ్డాను. ఇది నా శరీరం మొత్తాన్ని వికృతంగా మార్చేసింది. ముఖం, శరీరంపై చికెన్ పాక్స్ మచ్చలు చూడండి ఉన్నాయో. అదృష్టవశాత్తూ ప్రస్తుతం నాకు ఏమీ కాలేదు. నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మీ అందరికీ కృతజ్ఙతలు. ఎప్పటిలాగే మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్న. ఎంతోకాలంగా మృదువుగా కాపాడకుంటున్న నా చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కస్తూరి రాసుకొచ్చింది.

దాదాపు 22 ఏళ్లుగా సినిమాల్లో కొనసాగుతున్న కస్తూరి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా భారతీయుడు సినిమాలో కమల్‌ హాసన్‌ కూతురిగా మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత కస్తూరి.. ప్రస్తుతం సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. గృహలక్ష్మీ సీరియల్‌తో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఫేవరేట్‌గా మారిపోయింది. కస్తూరి నటించిన పరంపర వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. కస్తూరి 2000లో రవి కుమార్ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. కస్తూరి కూతురు ఇటీవల క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News