Home Entertainment Chiranjeevi vs Garikapati | గరికపాటి వర్సెస్ చిరంజీవి.. తప్పు ఎవరిది.. బుక్ అయిందెవరు..?

Chiranjeevi vs Garikapati | గరికపాటి వర్సెస్ చిరంజీవి.. తప్పు ఎవరిది.. బుక్ అయిందెవరు..?

Chiranjeevi vs Garikapati | సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్న పేర్లు రెండు మాత్రమే ఒకటి చిరంజీవి.. రెండు గరికపాటి నరసింహారావు. ఎప్పుడు ప్రవచనాలతో బిజీగా ఉండే గరికపాటి ఇప్పుడు వివాదాలతో బిజీ అయిపోయాడు. మరోవైపు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే మెగాస్టార్ మరోసారి తన హుందా తనంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ప్రతి సంవత్సరం మాదిరే ఈసారి కూడా దసరా తర్వాత రోజు బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అప్పటి వరకు చాలా సాఫీగా సాగిన ఈ కార్యక్రమంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అభిమానులతో ఫోటోలు దిగుతున్న చిరంజీవిని ఉద్దేశించి.. వెంటనే ఆయన అక్కడ ఫోటో సెషన్ ఆపకపోతే తాను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను.. అందులో ఎలాంటి మొహమాటం లేదు అంటూ మొహం మీదే చెప్పేశాడు గరికపాటి నరసింహారావు.

Read more: Rajinikanth | రజినీకాంత్ చేసిన పనికి డైలమాలో ఫ్యాన్స్.. నవ్వాలా ఏడవాలా..?

ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనను అలా అన్నా కూడా ఏ మాత్రం మనసుకు తీసుకోకుండా.. స్టేజి మీదకు వచ్చి గరికపాటికి ఎంతో వినయంగా వందనం చేశాడు మెగాస్టార్. ఈ సీన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వాళ్ళు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

పైగా నాగబాబు కూడా గరికపాటిపై సెటైర్లు వేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోతున్నారు. ఏ పాటి వారికైనా మెగాస్టార్ క్రేజ్ చూస్తే ఆ పాటి అసూయ కలగడం పరిపాటే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవికి వ్యతిరేకంగా.. గరికపాటిని సపోర్ట్ చేస్తూ బ్రాహ్మణ సంఘాలు అండగా నిలబడితే.. మెగా అభిమానులు మాత్రం గరికపాటి పాత వీడియోలు బయటకు తీసి ఇది ఆయన అసలు బాగోతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Read more : Nagarjuna | కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోతున్నాడా!

తాను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ అభిమానిని అని.. అప్పుడు నాగేశ్వరరావు సినిమాలు విడుదలయితే పోస్టర్లపై పేడ కొట్టేవాణ్ణి అంటూ గరికపాటి చెప్పిన పాత వీడియో వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అప్పుడు అభిమానం పేరుతో మరో హీరో పోస్టర్ పై పేడ కొట్టిన మీ పని కరెక్ట్ అయితే.. ఇప్పుడు చిరంజీవిపై అభిమానంతో ఫ్యాన్స్ ఫోటోలు దిగడం కూడా కరెక్టే కదా అంటున్నారు.

కాసేపు ఓపిక పట్టలేకపోయారా అంటూ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం సన్నివేశంపై గరికపాటి కాస్త బ్యాడ్ అయినట్లు అర్థమవుతుంది. అందుకే ఆయన చిరంజీవికి క్షమాపణ కూడా చెప్పాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి ఎక్కడా వీడియో ఆధారాలు లేవు.

Follow Us : FacebookTwitter

Read more articles |

Chiranjeevi | ఆటోజానీ ఎక్కడ.. ఉందా? పక్కన పడేసావా.. పూరీ జగన్నాథ్ కు చిరు స్ట్రెయిట్ క్వశ్చన్..

Health tips | రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినొచ్చా.. తింటే ఏమైనా ఉపయోగం ఉంటుందా ?

Health tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌ తాగొచ్చా?

Exit mobile version