Home Entertainment Ananya Panday | లైగర్‌ ఎఫెక్ట్‌.. ఆఫర్లు లేక భారీగా రెమ్యునరేషన్‌ తగ్గించిన అనన్య పాండే

Ananya Panday | లైగర్‌ ఎఫెక్ట్‌.. ఆఫర్లు లేక భారీగా రెమ్యునరేషన్‌ తగ్గించిన అనన్య పాండే

Ananya Panday | స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 సినిమాతో అనన్యను కరణ్‌ జోహార్‌ హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఫర్వాలేదనే అనిపించుకుంది తప్ప పెద్దగా క్రేజ్‌ అయితే తెచ్చుకోలేకపోయింది. పతి పత్నీ ఔర్‌ వో, ఖాళీ పీలీ, గెహ్రియన్‌ వంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ విజయ్‌ దేవరకొండతో పాన్‌ ఇండియా సినిమా లైగర్‌లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టి ఇటు టాలీవుడ్‌లో పాగా వేయాలని అనుకుంది. అలాగే బాలీవుడ్‌ తన సత్తా చూపించాలని అనుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా డిజాస్టర్‌ కావడంతో అనన్య పాండే ఆశలన్నీ అడియాశలైపోయాయి.

లైగర్‌ సినిమా డిజాస్టర్‌ కావడం వెనుక ఉన్న కారణాల్లో అనన్య పాండేను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేయడం కూడా ఒక్కటని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. సోషల్‌మీడియాలో కూడా అనన్యపై ట్రోల్స్‌ భారీగా వచ్చాయి. అనన్యకు యాక్టింగ్‌ సరిగ్గా రాదని.. అసలు ఆమెకు బదులు ఎవరిని తీసుకున్న సినిమా హిట్‌ అయ్యేదంటూ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. దీంతో ఈ అమ్మడి గ్రాఫ్‌ మొత్తం పడిపోయింది. ఎంత స్టార్‌ కిడ్‌ అయినప్పటికీ లైగర్‌ సినిమా దెబ్బతో ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈమె చేతిలో డ్రీమ్‌గర్ల్‌ 2 ఒక్కటే ఉంది. దీంతో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఇండస్ట్రీకి తొందరలోనే ప్యాకప్‌ చెప్పాల్సి వచ్చేలా ఉంది. అందుకే బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం కోసమని అనన్య పాండే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అనన్య పాండే తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించేసిందని బీటౌన్‌ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.80 లక్షలకు పైగా డిమాండ్‌ చేసిన అనన్య.. ఇప్పుడు రూ.50 లక్షలు మాత్రమే అడుగుతున్నదంట. అంటే తన రెమ్యునరేషన్‌ను 30 శాతానికి పైగా తగ్గించుకుంది. మరి ఇప్పుడైనా అనన్య పాండేకు ఛాన్స్‌లు వస్తాయో లేదో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Movie Ticket Only for One rupee | హైదరాబాదీలకు బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే సినిమా టికెట్‌.. నో కండీషన్స్‌

Keerthy Suresh | తెలుగు ఇండస్ట్రీపై ‘మహానటి’కి కోపం వచ్చిందా ? ఆ సినిమా కీర్తి సరేశ్‌ కెరీర్‌కు మైనస్‌ అయిందా ?

Exit mobile version