Kissing Device | అదేంటి.. దూరంగా ఉన్న వాళ్లతో ఫోన్లో మాట్లాడతాం.. కానీ కిస్ ఎలా పెడతాం.. ఒకవేళ ముద్దు పెట్టినా దాని మాధుర్యాన్ని ఎలా ఫీలవుతామని అనుకుంటున్నారా? ఇప్పటివరకు అంటే అది కష్టమేమో కానీ.. ఇకపై కాదు.. ఎడబాటు తట్టుకోలేక విరహ బాధను అనుభవించే ప్రేమికుల కోసం చైనా విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. ఇక్కడ మనం ముద్దుపెడితే.. ఎక్కడో వందల, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రేయసి ఆ అనుభూతిని పొందేలా ఒక డివైజ్‌ను రూపొందించారు.
చైనాకి చెందిన జియాంగ్ జోంగ్లీ అనే విద్యార్థి ఈ కిస్సింగ్ డివైజ్ తయారు చేశాడు. ఈ డివైజ్‌లో సిలికాన్‌తో కృత్రిమ పెదాలను తయారు చేసి ఉంచాడు. వాటికి కొన్ని ప్రెజర్ సెన్సర్లు, యాక్యురేటర్లను అమర్చాడు. దీనివల్ల ఎప్పుడైతే సిలికాన్ పెదాల మీద ముద్దు పెడతామో.. సెన్సర్ల సాయంతో మనమే కాదు.. అవతలి వాళ్లు కూడా ఆ ముద్దులోని మాధుర్యాన్ని అనుభూతి చెందుతారు. ప్రస్తుతం చైనా ఈ కామర్స్ వెబ్సైట్లో ఈ డివైజ్ అందుబాటులో ఉంది. దీని ధరను రూ.3వేలుగా నిర్ణయించారు.
ఎలా పనిచేస్తుంది
ఈ కిస్సింగ్ డివైజ్ ప్రత్యేకమైన యాప్ సహాయంతో పనిచేస్తుంది. ముందుగా మీ మొబైల్లో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మొబైల్ చార్జింగ్ పోర్టుకు డివైజ్‌ను కనెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రేయసికి యాప్ ద్వారా వీడియో కాల్ చేయాలి. అప్పుడు డివైజ్‌లోని సిలికాన్ పెదాల మీద ముద్దు పెడితే అవతలి వాళ్లు దాన్ని ఫీలవుతారు. తాను కనిపెట్టిన ఈ డివైజ్.. ప్రేమికులు, వృత్తిరీత్యా దూరంగా ఉండే భార్యాభర్తలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జియాంగ్ చెబుతున్నాడు. కానీ దీనిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి డివైజుల కారణంగా పిల్లల జీవితం ప్రభావితం అవుతుందని.. వాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
ఇందులో పెదాలను సిలికాన్‌తో తయారుచేశారు. అలాగే, సెన్సర్లను అమర్చి అచ్చం ముద్దు పెట్టినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి ఫీల్ వచ్చేలా చేశారు. మనిషి నోటి ఆకారంలో ఉండే ఈ పరికరాన్ని పెయిరింగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వాడాల్సి ఉంటుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ
Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు