Wednesday, May 15, 2024
- Advertisment -
HomeLatest NewsJob notifications | తెలంగాణలో కొనసాగుతున్న కొలువుల జాతర.. న్యూఇయర్‌ ముందు మరో నాలుగు నోటిఫికేషన్లు...

Job notifications | తెలంగాణలో కొనసాగుతున్న కొలువుల జాతర.. న్యూఇయర్‌ ముందు మరో నాలుగు నోటిఫికేషన్లు జారీ

Job notifications | తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌. టీఎస్‌పీఎస్సీ మరో నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 1 , 2, 3, 4తో పాటు పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయగా.. తాజాగా శనివారం మరో నాలుగు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

కళాశాల విద్యాశాఖలో 544 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లు, ఫిజికల్‌ లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష ఉంటుంది.

విద్యాశాఖలో 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్‌ కమిషనరేట్‌లో 40, సాంకేతిక విద్యాశౄఖలో 31 లైబ్రేరియన్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

మున్సిపల్‌ శాఖలో 78 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో 64 సీనియర్‌ అకౌంటెంట్‌, 13 జూనియర్‌ అకౌంటెంట్‌, ఒక అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు కలవు. ఈ ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి కూడా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవి 1 నుంచి ఏప్రిల్‌ 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష ఉంటుంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News