Prabhas in Raja Deluxe | వరుస సినిమాలతో ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయాడు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో రెబల్ స్టార్ నటించే ప్రతి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తోనే నిర్మిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టుగా మారుతితో తెలుగులో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. చాలా రోజుల తర్వాత కామెడీ ఎంటర్‌టైన్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుందా అని ఆడియన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా హారర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. దీనికోసం భారీ సెట్టింగ్ వేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన పిక్ ఒకటి లీకైంది. డైరెక్టర్ మారుతితో కలిసి ప్రభాస్ సెట్లో ఉన్న పిక్ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో ఉన్నాడు. వింటేజ్ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.దీంతో రాజా డీలక్స్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో పాత ప్రభాస్‌ను చూడొచ్చని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
రాజా డీలక్స్ సినిమా ఒక థియేటర్ నేపథ్యంలో ఉంటుందని మొదట్నుంచి ప్రచారం జరుగుతోంది. తాతా-మనమళ్ల కథతో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ తాతగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే నిధి అగర్వాల్‌ను ఈ సినిమా నుంచి తప్పించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఏది రాలేదు.
Read More Articles |
kalpika ganesh | వాళ్లందరి బండారం బయటపెడతా.. కల్పిక గణేశ్ వార్నింగ్
Sneha divorce | సినీ నటి స్నేహ విడాకుల రూమర్స్.. ఆ ఒక్క ఫొటో చెక్ పెట్టినట్లేనా?
Avatar 2 ott release date | అవతార్2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్‌గా మారిన రిలీజ్ డేట్
chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు