Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentkalpika ganesh | వాళ్లందరి బండారం బయటపెడతా.. కల్పిక గణేశ్ వార్నింగ్

kalpika ganesh | వాళ్లందరి బండారం బయటపెడతా.. కల్పిక గణేశ్ వార్నింగ్

kalpika ganesh | సంచలన వ్యాఖ్యలతో ఈ మధ్య తరచూ వార్తల్లోకెక్కుతుంది కల్పికా గణేశ్‌. సమంతలాగే తను కూడా మయోసైటిస్‌తో బాధపడుతున్నానని రివీల్‌ చేసి ఇటీవల షాకిచ్చింది. అప్పట్నుంచి ఎప్పుడూ ఏదో ఓ కామెంట్‌ చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మొన్నటికి మొన్న నటి ధన్య బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కి పిలవకపోయినా వెళ్లింది. ఇండస్ట్రీలో చాలామంది సీక్రెట్స్‌ను బయటపెడతానంటూ బెదిరించింది.

పెళ్లయిన కోలీవుడ్‌ కోలీవుడ్‌ డైరెక్టర్‌ బాలాజీ మోహన్‌తో ధన్య బాలకృష్ణ రిలేషన్‌లో ఉందని కల్పికా గణేశ్‌ ఇటీవల బయటపెట్టింది. వాళ్లిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం కూడా పెట్టారని పేర్కొంది. ఇంకా చాలా విషయాలు చెబుతూ ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. కానీ ఆ వీడియో డిలీట్‌ అయ్యింది. అయితే ఆ వీడియోను తన పలుకుబడిని ఉపయోగించి బాలాజీ మోహన్‌ డిలీట్‌ చేయించాడని ఆరోపణలు కూడా చేసింది. అయినా ఈ విషయాల మీద ధన్య బాలకృష్ణ‌, బాలాజీ మోహన్‌ ఇద్దరూ బహిరంగంగా స్పందించలేదు. దీంతో మరోసారి కల్పికనే ఈ విషయంపై ఓపెన్‌ అయ్యింది. నేను షేర్‌ చేసిన వీడియోను నీ పవర్‌ చూపించి యూట్యూబ్‌లో లేకుండా చేశావు కదా.. ఇప్పుడు నా పవర్‌ చూపిస్తే మీరంతా భస్మమైపోతారు అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అయినా కూడా ధన్య బాలకృష్ణ దీనిపై స్పందించలేదు. ఈ వివాదం అలా ఉండగానే మరోసారి కల్పిక గణేశ్‌ రెచ్చిపోయింది.

ఓ అవార్డు ఫంక్షన్‌కు పిలవకుండానే వెళ్లింది కల్పికా గణేశ్‌. ఈ విషయాన్ని ఆమె స్టేజి ఎక్కి మరీ చెప్పింది. తననెవరూ ఆ ఫంక్షన్‌కు ఆహ్వానించలేదని.. అయినా సరే వచ్చానని తెలిపింది. ఇండస్ట్రీని తన ఇల్లుగా భావిస్తానని.. అందుకే ఎవరూ పిలవకపోయినా మొహమాటం లేకుండా వచ్చేశానని చెప్పింది. ఇక ఈమధ్య తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపైన కూడా నోరువిప్పింది. జనాలకు నిజాలేంటో తెలియాలనే చాలామంది నిజస్వరూపాలను బయటపెడుతున్నానని వెల్లడించింది. ధనుష్‌, ధన్య బాలకృష్ణన్‌, అనిరుధ్‌, బాలాజీ మోహన్‌.. ఇలా కొందరి గురించి అసలు నిజాలు బయటకు రావాల్సి ఉందని తెలిపింది. సుచీలీక్స్‌ ఊరికే బయటకు రాలేదని పేర్కొంది. దీనిపై చిన్మయి కూడా ఎంతో పోరాడిందని.. కానీ ఆమె నోరు మూయించారని చెప్పింది. ఈ కొత్త సంవత్సంలో ఇంకా చాలామంది బండారాలు బయటపెడతానని బాంబు పేల్చింది. ధన్య బాలకృష్ణ తర్వాత కల్పికా గణేశ్‌ ఎవరి సీక్రెట్స్‌ బయటపెడుతుందో చూడాలి మరి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Disaster movies of 2022 | ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యంత డిజాస్టర్‌ అయిన మూవీస్‌ ఇవే..

Sneha divorce | సినీ నటి స్నేహ విడాకుల రూమర్స్‌.. ఆ ఒక్క ఫొటో చెక్‌ పెట్టినట్లేనా?

Avatar 2 ott release date | అవతార్‌2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్‌గా మారిన రిలీజ్‌ డేట్‌

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News