Horoscope Today | మేషం
నూతన పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు పొందే సూచన ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. షేర్లు, భూక్రయవిక్రయాలతో లాభాలు పొందుతారు.
వృషభం
సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు పొందే సూచన ఉంది.
మిథునం
చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి, ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి అరుదైన అహ్వానాలు అందుతాయి.
కర్కాటకం
ఇంటర్వ్యూలు అందుకుంటారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటాబయట ప్రోత్సాహం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అనుకోని అతిథులను కలుసుకుంటారు.
సింహం
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబసభ్యులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు లాభం ఉంది.
కన్య
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఇంటాబయట ప్రోత్సాహం అందుకుంటారు.
తుల
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు.
వృశ్చికం
కొత్త పనులు ప్రారంభిస్తారు. వస్తు కొనుగోళ్లు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ధనుస్సు
బంధువులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. శ్రమపడిన ఫలితం కష్టమే. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. ధనలాభ సూచన ఉంది.
మకరం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
కుంభం
కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి,వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు హోదా పొందే సూచన ఉంది.
మీనం
సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. వాహనాలు, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. సంతానానికి ఉద్యోగ సూచన ఉంది.
Read More Articles |
Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?
Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి
Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం