Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest Newsphase out Rs. 2000 Notes | 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తున్నారా...

phase out Rs. 2000 Notes | 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తున్నారా ? రాజ్యసభలో బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

phase out Rs. 2000 Notes | వెయ్యి, ఐదొందల రూపాయల నోట్లను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం దృష్టి ఇప్పుడు 2వేల రూపాయల నోట్ల మీద పడిందా ? తాజాగా అధికార బీజేపీ ఎంపీ చేసిన డిమాండ్‌ ఇప్పుడు అందరి దృష్టి 2వేల రూపాయల నోట్ల మీదకు మళ్లేలా చేసింది. ఎందుకంటే.. పార్లమెంట్‌ వేదికగా బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ సుశీల్‌ మోదీ ఇదే విషయాన్ని లేవనెత్తారు.

క్రమంగా 2వేల రూపాయల నోటును కూడా రద్దు చేయాలని రాజ్యసభ జీరో అవర్‌లో డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చెలామణిలో లేవని అన్నారు. వెయ్యి, ఐదొందల నోట్లను రద్దు చేసి పెద్ద నోట్లను చెలామణిలో ఉంచడం సరికాదని అన్నారు. పెద్దనోట్లను అక్రమార్కులు మనీలాండరింగ్ కోసం, డ్రగ్స్‌ ఖరీదు చేసేందుకు వాడుతున్నారని ఆరోపించారు.

2 వేల నోట్లను రద్దు చేసే ముందు ప్రజలకు ఒక అవకాశం ఇవ్వాలని సూచించారు. పెద్ద నోట్లను రెండేండ్ల వ్యవధిలో బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే అవకాశం ఇచ్చిన తర్వాత రద్దు చేయాలన్నారు. దేశంలో ఎక్కడ చూసినా రెండు వేల నోట్లు కనిపించడం లేదని, ఏటీఎంలలో కూడా రావట్లేదని అన్నారు. 2 వేల నోట్లపై ప్రజలకు అనేక అపోహలు ఉన్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచిచూడాలి.

2వేల రూపాయల నోట్ల ముద్రణ ఆపేసిందా?

2019 నుంచి ఇప్పటివరకు రెండు వేల నోటు ఒక్కటీ ముద్రించలేదని భారత రిజర్వ్‌ బ్యాంక్‌ ( RBI ) తెలిపింది. ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా దీనిపై వివరణ ఇచ్చింది. 2017 మార్చి 31 నాటికి ఆర్థిక వ్యవస్థలో 50.2 శాతం ఉన్న 2వేల నోట్ల వాటా.. 2022 మార్చి 31 నాటికి 13.8 శాతానికి పడిపోయింది. అంటే వ్యూహం ప్రకారమే పెద్ద నోట్ల ప్రింటింగ్‌ను తగ్గిస్తూ వస్తున్నారన్నమాట.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News