Thursday, June 13, 2024
- Advertisment -
HomeLatest NewsChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు...

ChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

ChatGPT | కొత్త ప్రదేశానికి వెళ్లాలన్నా, అక్కడి అడ్రస్‌ గుర్తించాలన్నా, ఫొటోలు సేవ్‌ చేసుకోవాలన్నా గూగుల్‌ కావాల్సిందే. స్కూల్‌ విద్యార్థుల ప్రాజెక్టుల నుంచి మొదలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వరకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతకాల్సిందే. ఇంతలా మనజీవితాల్ని ప్రభావితం చేస్తున్న టెక్నాలజీ సమీప భవిష్యత్తులో ఊహకందని స్థాయికి వెళ్లనుందా ? మనకు తెలియకుండానే మన జీవితాలను సమూలంగా మార్చనుందా ? ఇటీవల సంచలనంగా మారిన కొత్త సాంకేతికత అడుగులు అటువైపే పడుతున్నాయా ? ఇంతకీ ఏంటా టెక్నాలజీ ? గూగల్‌ వంటి దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ కూడా భయపడేంతలా ఏముంది ? ఒక్కసారి తరిచి చూస్తే..

టెస్లా, ట్విటర్‌ వంటి ప్రముఖ కంపెనీల అధిపతి ఎలాన్‌ మస్క్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడి పెట్టిన ఓపెన్‌ఏఐ(OpenAI) రూపొందించిన అధునాతన టెక్నాలజీనే చాట్‌జీపీటీ ( ChatGPT ). అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో 2015లో శామ్‌ ఆల్ట్‌మన్‌, ఎలాన్‌ మస్క్‌లు 100 కోట్ల డాలర్లతో ఓపెన్‌ఏఐ సంస్థను ఏర్పాటు చేశారు. మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 2019లో మరో 100 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. భవిష్యత్‌ ఆశాకిరణంలా మారిన ఈ చాట్‌జీపీటీని కృత్రిమమేధ ( Artificial Intelligence ) సహాయంతో పట్టాలెక్కించారు. గత నవంబర్‌ 30న పబ్లిక్‌ టెస్టింగ్‌ కోసం ఉచితంగా చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ వారంలోనే లక్షల యూజర్లు ఈ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదుచేసుకున్నారు. సరికొత్త టెక్నాలజీని చూసి నోరెళ్లబెడుతున్నారు. దీంతో చాట్‌జీపీటీ ఒక్కసారిగా ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.

ఎలా పనిచేస్తుంది ?

ఇప్పటికే పలు కంపెనీలు కృత్రిమమేధ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు రూపొందించినప్పటికీ వాటి పరిధి చాలా తక్కువ. మనుషుల ప్రమేయాన్ని తగ్గిస్తూ పలు సంస్థలు ఇప్పటికే చాట్‌బోట్‌లను వాడుతున్నాయి. అయితే చాట్‌జీపీటీ చాట్‌బోట్‌ కంటే భిన్నమైనది. దీన్ని థర్డ్‌ జెనరేషన్‌ జెనరేటివ్‌ ప్రీ ట్రెయిన్‌డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఆధారంగా రూపొందించారు. మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్‌లో వెతుకుతాం. అయితే అది వెంటనే మనం వెతుకున్న సమాచారానికి సంబంధించి కుప్పలు తెప్పలుగా లింక్‌లను మన ముందు ఉంచుతుంది. అందులో మనకు కావాల్సిన సమాచారాన్ని మనకు నచ్చినట్లుగా వెతుక్కోవాల్సిందే. అయితే ఇందులో సరైన సమాచారం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కాస్త కష్టమే. అయితే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు భిన్నంగా ఈ చాట్‌జీపీటీ పనిచేయనుంది. కేవలం మనం దేనికోసం వెతుకుతున్నామో చాట్‌బాట్‌లో ఎంట్రీ చేస్తే చాలూ వందల పేజీలను జల్లెడపట్టి ఖచ్చితమైన సమచారాన్ని అందిస్తుంది. మనం అడిగే సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని సులువుగా ఇంగ్లీష్‌‌లోనే సమాధానం ఇస్తుంది. దీనిలో వాడిన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ఆధారంగా నెక్స్ట్ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలను ముందే వెతుక్కుటుంది. తప్పొప్పులను సరిచేస్తుంది.

సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లు, గణిత ప్రశ్నలు, కొత్త పరిశోధక పత్రాలు, వ్యాసాలు రాయడం, కవితలు ఇలా ఏది అడిగినా క్షణాల్లోనే రాసి పెడుతుంది. జోకులు చెబుతుంది. మనం అడిగే ప్రశ్నలను చాలా కూలంకశంగా పరీక్షించి మరీ సమాధానాలు ఇస్తుంది. ఒకవేళ మనం అడిగే ప్రశ్న సెన్సిటివ్‌గా ఉంటే హెచ్చరిక జారీ చేస్తుంది. కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ కంటెంట్‌ క్రియేషన్‌, కస్టమర్‌ సర్వీస్‌ ఇలా ప్రతి రంగంలోనూ భవిష్యత్తులో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇక ఈ చాట్‌జీపీటీలో రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌ ఫ్రమ్‌ హ్యూమన్‌ ఫీడ్‌బ్యాక్‌(RLHF) అనే మరో అదనపు టెక్నాలజీని వాడారు. ఇది మనం ఇచ్చే సూచనలు తీసుకోవడంతో పాటు సంతృప్తికర సమాధానాలను ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. అచ్చం మనుషుల్లాగే మాట్లాడడంలో సహాయపడుతుంది.

ఇంకా ప్రయోగదశలోనే..

ప్రస్తుతానికైతే ఇది ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ యూజర్లు తమ మెయిల్‌తో ఐడీతో లాగిన్‌ కావొచ్చు. తొలుత ఓపెన్‌ఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ట్రై చాట్‌జీపీటీపై క్లిక్‌ చేయాలి. ఇక సైన్‌అప్‌ అయ్యి ఈచాట్‌బోట్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతానికి దీని సేవలను ఉచితంగానే అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఈ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేశాక సబ్‌స్క్రి ప్షన్‌ రుసుం వసూలు చేసే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు జీపీటీ-3 కోసం 175 బిలియన్ల పారామితులతో, 570 గిగాబైట్ల సమాచారంతో శిక్షణ ఇచ్చారు. దీన్ని అత్యంత భారీ ఏఐ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌గా భావిస్తున్నారు. అయితే టెక్నాలజీ రంగంలోనే మైలురాయిగా భావిస్తున్నప్పటికీ సమాచార సేకరణలో అప్పుడప్పుడు కొన్ని తప్పులు దొర్లే అవకాశాలు ఉన్నాయి. అయితే అత్యంత ఖచ్చితత్వంతో సమాధానాలు రాబట్టేందుకు ఓపెన్‌ఏఐ సంస్థ ఇంకా కృషి చేస్తోంది.

అక్కడ చాట్‌జీపీటీపై నిషేధం?

ఒకవైపు ఈ టెక్నాలజీని ఆకాశానికి ఎత్తుతుండగా, మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే యూఎస్‌ స్టార్టప్‌లలో అత్యంత తక్కువ సమయంలో ఇది అగ్రస్థానానికి దూసుకెళ్లినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్‌యూఐ కంపెనీ 30 బిలియన్ల యూఎస్‌ డాలర్ల మూలధనాన్ని సేకరించే పనిలో పడింది. ఇందుకోసం కంపెనీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లను వెతుకుతున్నారని పలు నివేదికలు ఊటంకిస్తున్నాయి. ఇదిలా ఉంటే న్యూయార్స్‌లోని కొన్ని కళాశాలలు, పాఠశాలలో చాట్‌జీపీటీ ఉపయోగించడాన్ని నిషేధించాలని యోచిస్తున్నారు. చాట్‌జీపీటీలో సెర్చింగ్‌ అనేది విద్యార్థులపై ప్రభావం చూపునుందని, హోంవర్క్‌ చేసేందుకు అవకాశం ఉండదని, సమాచార భద్రత దృష్ట్యా దాన్ని పరిమితంగా ఉపయోగించడంపై చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక మరో నివేదిక ప్రకారం చాట్‌జీపీటీ సైబర్‌ నేరాలకు అనుకూలంగా మారనుందట. చాట్‌బాట్‌లో పలు సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లను సెర్చ్‌ చేసి సమాచారం తెలుసుకునే అవకాశం ఉందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Microsoft | విండోస్‌ 7 వాడే వారికి షాకింగ్‌ న్యూస్‌.. వెంటనే ఈ పనిచేయమని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Whatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News