Monday, March 27, 2023
- Advertisment -
HomeLatest NewsWT20 World cup | స్మృతి, రిచా మెరుపులు వృథా..మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి...

WT20 World cup | స్మృతి, రిచా మెరుపులు వృథా..మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి

WT20 World cup | టైమ్ 2 న్యూస్, గెబెరా (దక్షిణాఫ్రికా): వరుస విజయాలతో జోరుమీదున్న భారత మహిళల జట్టుకు.. టీ20 ప్రపంచకప్లో తొలి పరాజయం ఎదురైంది. గత రెండు మ్యాచ్ల్లో చక్కటి విజయాలు నమోదు చేసుకున్న టీమిండియా.. శనివారం ఇంగ్లండ్తో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. నటాలియా స్కీవర్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 5 వికెట్లతో సత్తాచాటింది. అంతర్జాతీయ టీ20ల్లో రేణుకకు ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. రేణుక తొలి స్పెల్లో భాగంగా వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టింది. చివరి ఓవర్లో రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. శిఖ పాండే, దీప్తి శర్మ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

పోరాడినా నిరాశే!

అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. షఫాలీ వర్మ (8), జెమీమా రోడ్రిగ్స్ (13), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (4) విఫలమయ్యారు. ఆరంభం నుంచే అవసరమైనంత వేగంతో పరుగులు చేయలేకపోవడం జట్టును దెబ్బకొట్టింది. చివరి ఓవర్లో విజయానికి 31 పరుగులు అవసరమైన దశలో రిచా రెచ్చిపోయినా 19 రన్స్ మాత్రమే రాబట్టగలిగింది. గత రెండు మ్యాచ్ల్లో విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన హర్మన్ బృందం ఈ సారి గెలుపు గీత దాటలేకపోయింది. గ్రూప్-2 నుంచి ఆడిన మూడు మ్యాచ్ల్లో నెగ్గిన ఇంగ్లండ్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ రెండు విజయాలు, ఒక పరాజయంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలిచింది. గత మ్యాచ్ల్లో రాణించిన జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో భారత జట్టు విజయావకాశాలను దెబ్బతీయగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వైఫల్యం గెలుపును దూరం చేసింది. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న రిచా ఘోష్ క్రీజులో ఉన్నా.. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకున్నారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లగా.. తదుపరి పోరులో సోమవారం ఐర్లాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News